పవన్ కళ్యాణ్ నటించిన సినిమా అంటే ఎన్టీఆర్ కు చాలా ఇష్టమట.. ఏ సినిమా అంటే?

ప్రస్తుత కాలంలో హీరోల మధ్య ఎంతో మంచి స్నేహ బంధం ఉంది. ఇలా వీరి మధ్య ఉన్న స్నేహ బంధం ఎన్నోసార్లు బయటపడిందని చెప్పవచ్చు. ఇకపోతే ఒక హీరో నటించిన చిత్రాలు మరొక హీరోలకు ఎంతగానో నచ్చుతాయని పలువురు వివిధ సందర్భాలలో బయటపెట్టారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తనకు పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఇష్టం అని వెల్లడించారు.

ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా బుల్లితెరపై ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమం ప్రసారం అవుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి మహేష్ బాబు అతిథిగా రాబోతున్నట్లు గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ మహేష్ బాబు ను ఉద్దేశించి ఓ ప్రశ్న అడగగా అందుకు మహేష్ బాబు పవన్ కళ్యాణ్ లైఫ్ లైన్ వాడుకున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కు ఫోన్ కలిపిన ఎన్టీఆర్ తనతో ఎంతో సరదాగా ముచ్చటించినట్లు సమాచారం.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా అంటే తనకు చాలా ఇష్టమని ఈ సందర్భంగా ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ తో చెప్పినట్లు సమాచారం. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే డిసెంబర్ 2వ తేదీ వరకు వేచి చూడాలి.డిసెంబర్ 2వ తేదీ ఎన్టీఆర్ కార్యక్రమానికి మహేష్ బాబు అతిథిగా వచ్చినటువంటి ప్రీమియర్ ప్రసారం కానుంది.మామూలుగానే ఎన్టీఆర్ మహేష్ బాబుకు ఎంతోమంది అభిమానులు అలాంటిది ఈ ఇద్దరు హీరోలు ఒకే వేదికపై సందడి చేస్తే ఇక అభిమానులకు ఒక పండుగ వాతావరణం ఏర్పడుతుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం కోసం ఎన్టీఆర్ అభిమానులు మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.