పవన్ కళ్యాణ్ ‘ఓజీ’లో హీరోయిన్ లేదా.?

‘రన్ రాజా రన్’, ‘సాహో’ సినిమాల దర్శకుడు సుజిత్‌తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా షురూ చేసిన సంగతి తెలిసిందే. లాంఛనంగా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయిన ఈ సినిమాకి ‘ఓజీ’ అనే టైటిల్ ప్రచారంలో వుంది. ఈ సినిమాకి సంబంధించి ఓ గాసిప్ ఇండస్ర్టీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాకి హీరోయిన్ లేదట. పాటలూ, ఫైట్లూ కూడా లేవనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు తూచ్.! అదంతా వుత్తదే. సీరియస్ సినిమానే కానీ, టైమింగ్‌తో కూడిన మంచి కామెడీ వుంటుందంటున్నారు. హీరోయిన్, పాటలు కూడా వుంటాయట. యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ అనే లీకులు ఎలాగూ వున్నాయ్.

సో, హై ఓల్టేజ్ యాక్షన్ బ్లాక్స్ బాక్సాఫీస్‌ని మోతెక్కించేయనున్నాయని మాట్లాడుకుంటున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది.