ఓజీ: పవన్ కళ్యాణ్ సూపర్ స్పీడ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం గ్యాప్ లేకుండా చేతిలో సినిమాలు పెట్టుకొని ఉన్నారు.ఇప్పటికే సముద్రఖని దర్శకత్వంలో బ్రో మూవీ టాకీ పార్ట్ మొత్తం పవన్ కళ్యాణ్ కంప్లీట్ చేసేశాడు. రీసెంట్ గా ఆ మూవీ షూటింగ్ షెడ్యూల్ లో కూడా జాయిన్ అయ్యారు. మరో వైపు సుజిత్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మాణంలో ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ మూవీ చేస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ కూడా గ్యాప్ ఇవ్వకుండా బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ తో పూర్తి చేసే పనిలో పవన్ కళ్యాణ్ పడ్డారు. హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్ పక్కన పెట్టి మరీ ఓజీ కంప్లీట్ చేయడంపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టడం విశేషం. పవన్ కళ్యాణ్ లేకుండానే హైదరాబాద్ లో మూడో షెడ్యూల్ ని సుజిత్ కంప్లీట్ చేసేసారంట.

ప్రస్తుతం నాలుగో షెడ్యూల్ కి రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్ కి సంబందించిన కీలకమైన టాకీ పార్ట్ ని తెరకెక్కించే ప్లాన్ లో సుజిత్ ఉన్నారంట. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంత జెట్ స్పీడ్ తో ఓజీ మూవీ ఎందుకు పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో చర్చనీయాంశంగా మారింది.

నిర్మాత డీవీవీ దానయ్య దగ్గర పవన్ కళ్యాణ్ ఎప్పుడో అడ్వాన్స్ తీసుకున్నారంట. అయితే దానికి వడ్డీలు ఎక్కువ అవుతూ ఉండటం, నిర్మాతగా అదనపు భారం అవుతుందని ముందుగా ఓజీ సినిమాని కంప్లీట్ చేయడంపై పవన్ కళ్యాణ్ దృష్టి సారించినట్లుగా టాక్ వినిపిస్తోంది. దీనిని కంప్లీట్ చేసిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలకి డేట్స్ అడ్జస్ట్ చేసి ఫినిష్ చేయాలని అనుకున్తున్నరంట.

కెరియర్ లో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో చాలా స్పీడ్ గా ఉన్నారు. గ్యాప్ లేకుండా రాత్రి, పగలు కూడా షూటింగ్ చేస్తూ వీలైనంత వేగంగా కమిట్ అయిన ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలనే టార్గెట్ లో ఉన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తోన్న మాట.