పవన్ కళ్యాణ్ కొత్త మేకోవర్.?

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విదేశాలకు వెళ్ళిన సంగతి తెలిసిందే. వచ్చే నెల మొదటివారం నుంచి ఆయన తన తదుపరి సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు.

కాగా, ఈ సినిమా కోసం కంప్లీట్ మేకోవర్ అవసరమని దర్శకుడు హరీష్ శంకర్ భావిస్తున్నాడట. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్, తగిన మేకోవర్ కోసం ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.

అదేంటీ, సినిమా షూటింగ్ ఆల్రెడీ ప్రారంభమైంది కదా.? కొన్నాళ్ళ క్రితమే ఓ గ్లింప్స్ కూడా వదిలారు కదా.? అంటే, అది అదే.. ఇది ఇదేనట.! ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం పవన్ కళ్యాణ్ రెండు గెటప్స్‌లో కనిపించబోతున్నారట.

ఆ రెండో గెటప్ కోసమే.. ఈ మేకోవర్ అని అంటున్నారు. సెప్టెంబర్ మొత్తం పూర్తిగా, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసమే పవన్ కళ్యాణ్ కేటాయించబోతున్నారన్నది తాజా ఖబర్. ఆ తర్వాత, ఆయన ‘ఓజీ’ వైపుకు వెళతారు. అక్టోబర్ నెలంతా ‘ఓజీ’ పనుల్లోనే బిజీగా వుంటారు పవన్ కళ్యాణ్.

మేకోవర్ అంటే, మరీ పూర్తిగా డిఫరెంట్‌గా వుండదనీ.. ‘ఓజీ’ కోసం కూడా పనికొచ్చేలా.. అలాగే ‘ఉస్తాద్ భగత్ సింగ్’లోనూ డిఫరెంట్‌గా వుండేలా ప్లాన్ చేశారని అంటున్నారు. సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

‘ఓజీ’లో ప్రియాంక మోహన్ హీరోయిన్ కాగా, ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో శ్రీలీల, సాక్షి వైద్య హీరోయిన్లు.