పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం గ్యాప్ లేకుండా వరుసగా మూవీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. హరిహర వీరమల్లు మూవీ పాన్ ఇండియా రేంజ్ లో పీరియాడికల్ జోనర్ లో తెరకెక్కుతోంది. సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ రెండు షెడ్యూల్స్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా సెట్స్ పైన ఉంది.
సముద్రఖని దర్శకత్వంలో చేసిన వినోదాయ సీతమ్ మూవీ రీమేక్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇలా ఏకంగా నాలుగు సినిమాలని పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. వినోదాయ సీతమ్ మూవీ రీమేక్ జులై 28న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసుకుంటూనే పెండింగ్ పార్ట్ షూటింగ్ కి రెడీ అవుతోంది.
ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ బ్యాక్ టూ బ్యాక్ షూటింగ్ చేస్తూ ఆగష్టు లోపు కంప్లీట్ చేయాలని పవన్ కళ్యాణ్ లక్ష్యంగా పెట్టుకున్నారంట. ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ సినిమాల రిలీజ్ విషయంపై కూడా బ్యాక్ టూ బ్యాక్ ప్లాన్ చేస్తున్నారంట. హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ దీపావళికి అనుకుంటున్నారు. ఇంకా డేట్ అయితే కన్ఫర్మ్ చేయాల్సి ఉంది.
ఇప్పుడు ఓజీ మూవీని కూడా డిసెంబర్ లో రిలీజ్ చేయాలని అనుకున్తున్నారంట. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ తక్కువగా ఉంటుంది కాబట్టి అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోతుందని అంచనా వేస్తున్నారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ వచ్చే ఏడాది సంక్రాంతిని అనుకుంటున్నారు. డేట్ ఒక్కటే కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. దీనిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మొత్తానికి పవన్ కళ్యాణ్ వచ్చే ఏడాది జనవరిలోపు ఇప్పుడు చేస్తున్న సినిమాలు అన్ని రిలీజ్ చేసేయాలని అనుకున్తున్నారంట. ఎన్నికలు వస్తే మళ్ళీ ఎలక్షన్ కోడ్ అని అడ్డుపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు టాక్. అయితే ఇలా గ్యాప్ లేకుండా నెల రోజుల వ్యవధిలో రిలీజ్ చేయడం వలన డిస్టిబ్యూటర్స్ నష్టపోయే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై ఎలా ముందుకి వెళతారనేది వేచి చూడాలి.