పవన్ సినిమా.. చాలా కాలం తరువాత కూల్ రిలీజ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన బ్రో మూవీ జులై 28న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే లాంచ్ అయినా ట్రైలర్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యింది. వింటేజ్ పవన్ కళ్యాణ్ ని ఈ చిత్రంలో చూడబోతున్నారని ట్రైలర్ తోనే క్లారిటీ వచ్చింది. ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైంకి రెప్లికేట్ గా ఆయన పాత్ర ఉండబోతోంది.

వినోదాయ సీతామ్ రీమేక్ గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. మార్కండేయ క్యారెక్టర్ లో సాయి ధరమ్ తేజ్ కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలని టికెట్ ధరల పేర్లతో అడ్డుకుంది. వకీల్ సాబ్ సినిమాకి తీవ్ర అడ్డంకులు సృష్టించింది. అలాగే బీమ్లా నాయక్ సినిమాకి కూడా వైసీపీ సర్కార్ అడ్డంకులు క్రియేట్ చేసింది.

అయితే పేద ప్రజల కోసం టికెట్ ధరలు తగ్గించినట్లు సమర్ధించుకొని వచ్చారు. అయితే మరల ఇప్పుడు పవన్ కళ్యాణ్ బ్రో మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ చిత్రానికి కూడా ఏపీ సర్కార్ అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ అభిమానులు భావిస్తున్నారు. అయితే ఆ అవకాశం ఉండకపోవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ సినిమా టికెట్ ధరలు పెంచాలని ప్రభుత్వాలని రిక్వస్ట్ చేయడం లేదని నిర్మాత విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చారు.

జీవోల ప్రకారం అమల్లో ఉన్న ధరలలోనే టికెట్ లని విక్రయిస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రత్యేక బెన్ఫిట్ షోల కోసం కూడా అడగడం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే బ్రో సినిమాకి ఏపీలో వైసీపీ ప్రభుత్వం నుంచి అడ్డంకులు ఉండకపోవచ్చని భావిస్తునాన్నారు. ఏవో ప్రత్యేక కారణాలు చూపిస్తే తప్ప మామూలుగానే మూవీ రిలీజ్ అవుతుందని అనుకుంటున్నారు.

మరి ఇది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది మరొక్కరోజులో తెలిసిపోతుంది. ఒకవేళ ఏవైనా కారణాలు చూపించి అడ్డుకుంటే మాత్రం కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండొచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే బయ్యర్లకి కూడా బ్రో మూవీ విషయంలో పెద్దగా టెన్షన్ లేదని తెలుస్తోంది. ఏదేమైనా చాలా రోజుల తరువాత పవన్ కళ్యాణ్ సినిమా ఎలాంటి పొలిటికల్ కాంట్రవర్సీలు రాకుండా రిలీజ్ అవుతోంది.