Home News అన్న‌య్య‌కు క‌రోనా అని తెలిసి విస్తుపోయాం.. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధిస్తున్నా: ప‌వ‌న్

అన్న‌య్య‌కు క‌రోనా అని తెలిసి విస్తుపోయాం.. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధిస్తున్నా: ప‌వ‌న్

మెగాస్టార్ చిరంజీవి క‌రోనా బారిన ప‌డ‌డం ప్ర‌తి ఒక్క‌రికి షాకింగ్‌గా మారింది. ఎంతో జాగ్ర‌త్త‌గా ఉండే చిరంజీవికి కరోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ కావ‌డంతో టాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ‌తో పాటు అభిమానులు అవాక్క‌య్యారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాలంటూ ప్రార్ధ‌న‌లు చేస్తున్నారు. తాజాగా చిరంజీవి తమ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న అన్న‌కు క‌రోనా అని తెలిసి విస్తుపోయాం అని చెప్పారు.చిరంజీవి ఆరోగ్యం విషయమై ప్రెస్ నోట్ విడుదల చేశారు.

Pwan | Telugu Rajyam

ప‌వ‌న్ క‌ళ్యాణ్ విడుద‌ల చేసిన ప్రెస్ నోట్ లో.. అన్న‌య్య లాక్‌డౌన్ ప్ర‌క‌టించినప్ప‌టి నుండి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి ఒక్కరిలో కూడా చైతన్యం కలిగించారు. సామాజిక బాధ్యతతో పలు కార్యక్రమాలు చేప‌డుతూనే ఉన్నారు. ప్రజారోగ్యంపై ఎంతో అవగాహన ఉన్న అన్నయ్య తన ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా కూడా అన్నయ్య కరోనా బారిన పడటంతో మేమంతా కూడా విస్తుపోయాం. ఎలాంటి లక్షణాలు లేవు.. పరీక్షలో మాత్రం పాజిటివ్ అని వచ్చింది. అన్నయ్య సత్వరమే కోలుకోవాలని ఆశిస్తున్నాను అంటూ పవన్ పేర్కొన్నారు.

ఇదే సమయంలో క‌రోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ త్వరగా రావాలని కూడా కోరుకుంటున్నాను అన్నారు. సెకండ్ వేవ్ అంటూ వైధ్యులు హెచ్చరిస్తున్న ఈ సమయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలంటూ పవన్ సూచించారు. ప్ర‌స్తుతం ప‌వన్ వకీల్ సాబ్ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే మెగా బ్ర‌ద‌ర్స్ చిరంజీవి, నాగ‌బాబు క‌రోనా బారిన ప‌డ‌డంతో ప‌వన్ అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు. కాగా, చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డంతో పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది

- Advertisement -

Related Posts

బంగారు బుల్లోడు రివ్యూ: రొటీన్ ట్రాక్‌లో వెళ్లిన అల్ల‌రోడు..ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం

చిత్ర టైటిల్‌ : బంగారు బుల్లోడు నటీనటులు : అల్లరి నరేశ్‌, పూజా జవేరి, తనికెళ్ల భరణి, పొసాని కృష్ణ మరళి, అజయ్ ఘోష్, పృథ్వీ, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను,తదితరులు నిర్మాణ సంస్థ :...

కుప్పంలో వైసీపీని చూసి పెద్దిరెడ్డి షాక్.. ఆయన ముందే గొడవలు ?

చంద్రబాబు నాయుడుకు అధికారం పోయిందనే బాధ ఒక ఎత్తైతే అంతకు మించిన బాధ ఇంకొకటి ఉంది.  అదే కుప్పంలో మెజారిటీ తగ్గడం.  30 ఏళ్లుగా ప్రాతినిథ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడుకు గతంలో ఏనాడూ మెజారిటీ తగ్గిన దాఖలాలు లేవు. ...

కేటీఆర్ సీఎం అయితే పార్టీలో అణుబాంబు పేలుతుంది .. బండి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ  సీఎంగా మంత్రి కేటీఆర్ బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా పెద్ద చర్చే నడుస్తోంది. సొంతపార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్ సీఎం కానున్నారని బహిరంగ వేదికలపైనే వ్యాఖ్యానిస్తున్నారు. కేటీఆర్ సీఎం అయితే...

ప్రభాస్ స్కై-ఫై.. ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రభాస్ తో ఒక స్కై ఫై సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు....

Latest News