బ్రోఅవతార్ కాన్సెప్ట్ రివీల్ కావడం లేదా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ చిత్రంగా బ్రో అవతార్ మూవీ తెరకెక్కింది. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. జులై 28న రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. సినిమాకి సంబందించిన పోస్టర్స్ ని చిత్ర యూనిట్ రెగ్యులర్ గా రివీల్ చేస్తోంది. మూవీపై అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా బ్రోఅవతార్ నుంచి మరో కొత్త పోస్టర్ వచ్చింది. అందులో పవన్ కళ్యాణ్ ఓ బైక్ పై కాలు పెట్టి నిలబడి ఉంటే వెనుక తేజ్ ఉన్నాడు. ఈ లుక్ చూస్తూ ఉంటే తేజ్ ని టచ్ చేయాలంటే ముందు నన్ను దాటుకొని వెళ్ళాలి అనే ఎలివేషన్ ఇచ్చినట్లు ఉంది. ఈ మూవీ ఒరిజినల్ కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే కాలం, ఒక మనిషి మధ్య జరిగే కథగా ఉంటుంది.

కాలాన్ని రిప్రజెంట్ చేసే పాత్రలో పవన్ కళ్యాణ్ నటించారు. ఇక మార్కండేయులు అనే పాత్రలో తేజ్ కనిపిస్తున్నాడు. ఈ రెండు పాత్రల చుట్టూనే కథ మొత్తం తిరుగుతుందని తెలుస్తోంది. సముద్రఖని సినిమాలు అంటే బలమైన కంటెంట్ ఉంటుంది. ఈ మూవీలో కూడా కథ, అందుకు బలమైన సంభాషణలు త్రివిక్రమ్ పెన్ నుంచి వచ్చాయి.

అయితే బ్రో అవతార్ అప్డేట్స్ తో సినిమా ఎలా ఉండబోతోంది అని చెప్పడంలో చిత్ర యూనిట్ ఫెయిల్ అవుతోందనే మాట వినిపిస్తోంది. ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించాలంటే ఈ మూవీ ఎలా ఉండబోతోంది అనే దానిపై ప్రేక్షకులకి ఎంతో కొంత క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ సినిమా నుంచి రెగ్యులర్ గా ఇచ్చే అప్డేట్స్ తోనే వస్తోంది. ఈ అప్డేట్స్ కారణంగా మూవీపై హైప్ కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది.

అయితే బ్రో మూవీ గురించి ఆడియన్స్ కి ఇప్పటి వరకు సముద్రఖని రిలీజ్ చేసిన పోస్టర్స్ లో ఎలాంటి క్లారిటీ లేదు. తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ లో కూడా మూవీ ప్లాట్ ఏంటనేది రివీల్ చేయలేదు. ఇలా పోస్టర్స్ లో కాన్సెప్ట్ రివీల్ చేయకపోతే ప్రమోషన్స్ కి ఎలాంటి హెల్ప్ అవ్వదనే మాట వినిపిస్తోంది. అయితే పోస్టర్స్ లో పవన్ కళ్యాణ్ కనిపిస్తే సినిమాకి ఆటోమేటిక్ గా హైప్ వస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.