మరో వరల్డ్ రికార్డ్ తో పవన్ ఇన్స్టా.!

టాలీవుడ్ లో క్రేజ్ అంటేనే మొదటగా గుర్తుకొచ్చే పదం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందుకే పవన్ మాస్ క్రేజ్ లో గాడ్ గా పిలుచుకోగా పవన్ నటించిన సినిమాల వసూళ్లు ఓపెనింగ్స్ గాని సోషల్ మీడియాలో రికార్డులు కానీ చాలా వరకు పవన్ పేరు మీదే ఉన్నాయి.

పవన్ చాలా లేట్ గా సోషల్ మీడియాలోకి వచ్చాడు కానీ అదే ఓ రెండు దశాబ్దాల కిందే ఎంట్రీ ఇచ్చి ఉంటే ఇప్పటికి ఏ హీరో కూడా అందుకొని రేంజ్ లో పవన్ ఉండేవాడు. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్ గా పవన్ మరో సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టడమే రికార్డ్స్ తో స్టార్ట్ చేసాడు.

టాలీవుడ్ లో ఏ పాన్ ఇండియా హీరో కూడా అందుకొని మాసివ్ ఫాలోవర్స్ ని గంటల్లో కొట్టేసి కొత్త రికార్డు సెట్ చేసాడు. అంతే కాకుండా వరల్డ్ లోనే మోస్ట్ ఫాస్టెస్ట్ 1 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ ని అందుకున్న స్టార్ గా టాప్ 10 లో ఒకడిగా పవన్ నిలవగా మరి ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి ఒక్క పోస్ట్ కూడా పెట్టకుండా 1.5 మిలియన్ ఫాలోవర్స్ ని సాధించిన నాలుగో సెలబ్రెటీగా పవన్ వరల్డ్ లో నిలిచాడు.

దీనితో పవన్ క్రేజ్ కానీ తన ఫాలోయింగ్ కానీ ఎలా ఉందో మనం అర్ధం చేస్కోవాలి. మరి ఈ లిస్ట్ లో అయితే మొదటి మూడు స్థానాల్లో ఏంజెలినా జోలీ, ప్రిన్స్ హ్యారి, జె అనిస్టన్ తర్వాత పవన్ కళ్యాణ్ ఒక్కడే ఇండియా నుంచి ఉన్నాడు. ఇక పవన్ ఇపుడు తన వారాహి యాత్రకి బ్రేక్ ఇచ్చి ఇప్పుడు తన లేటెస్ట్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లోకి అయితే అడుగు పెట్టాడు.