CVL Narasimha Rao: అన్నవరం షూటింగ్ సమయంలో పవన్ కల్యాణ్ గారితో కలిసి కూర్చొని ఈ సోషల్ ఇష్యూస్‌పై మాట్లాడుతూ ఉన్నపుడు జరిగిన సన్నివేషంపై సినీ ఆర్టిస్ట్ సీవీఎల్ నరసింహారావు అన్నారు. సామాజిక పరిస్థితులపై, ఎక్కడైనా అన్యాయం జరుగుతుందని తెలిసినా వెంటనే ఏదైనా చేయాలని అనుకుంటారని ఆయన చెప్పారు. జైళ్లల్లో అండర్ ట్రయల్స్‌పై ఏదైనా చేద్దామనుకున్నపుడు, దాని మీద చాలా చర్చించామని, చాలా సమాచారం కూడా సేకరించామని ఆయన చెప్పుకొచ్చారు.
జైళ్లల్లో అన్యాయంగా మగ్గిపోతున్న వారి కోసం పాటుపడాలని అనుకున్నామని, ఒక్క మాటలో చెప్పాలంటే నాంది సినిమాలో లాగా చేయాలనుకున్నామని ఆయన చెప్పారు. అలాంటి కాన్సెంప్ట్ మీద 10,12 ఏళ్ల క్రితమే మేము చర్చించామని ఆయన తెలిపారు. నిజం చెప్పాలంటే అలా జైళ్లో ఉన్న వారికి సహాయం చేయడం, అండర్ ట్రయల్స్‌లో ఉన్న వారి కోసం పాటు పడడం అనేది చాలా మంచి కాన్సెంప్ట్ అని కూడా ఆయన కొనియాడారు. ఇప్పుడు ఆయన చాలా ఇష్యూస్‌పై పనిచేస్తున్నారు కాబట్టి ఆ విషయం కొంచెం పక్కకు వెళ్లి ఉండొచ్చని ఆయన చెప్పారు. అప్పుడే ప్రజారాజ్యా పార్టీ పెట్టడం, అలా కొన్ని సంఘటనలు అయ్యే సరికి ఇది పక్కన పెట్టి ఉంటారేమోనని కూడా ఆయన సందేహం వ్యక్తం చేశారు.
ఇకపోతే ఏ పార్టీ అయినా, ఏ ప్రాబ్లమ్ అయినా కామన్‌గా ఉండే ప్రాబ్లమ్ ఒకటే ఉంటుందని, అది అన్ని పార్టీలు కలిసి పరిష్కరించొచ్చు కదా అని ఆయన ప్రశ్నించారు. అది ఎందుకో కుదరట్లేదని ఆయన అన్నారు. అందుకే తాను ఏదైనా ఒక విషయాన్ని లేవనెత్తితే అన్ని రకాల వాళ్లను ఇన్వాల్వ్ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. అలా ఆ ప్రాబ్లమ్ అందరూ కలిసి పరిష్కరిస్తేనే ఈ సమాజం కూడా బాగు పడుతుందని ఆయన తెలిపారు.