టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా కూడా సెన్సేషన్ అవ్వడం కామన్. ఇక సాధారణంగా రాజకీయాల్లో నేతలు విమర్శలు చేయడం కామన్ అయినప్పటికీ సమయాన్ని సందర్భాన్ని బట్టి చాలెంజ్ లు లేకపోతే మొదటికే మోసం వస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ పై మిగతా రాజకీయ నాయకులు పర్సనల్ విషయాలలో ఎంత టార్గెట్ చేసినా కూడా పవన్ మాత్రం నిత్యం ప్రజలకు సంబంధించిన విషయాలపైనే సవాళ్లు విసురుతున్నారు.
ఇటీవల మచిలీపట్నంలో రైతుల కోసం బహిరంగ మీటింగ్ నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ హెచ్చరికలు చేశాడు. ఇక్కడ ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలలో శతకోటి నానిలు ఉన్నారు. వారిలో ఒకరికి చెబుతున్నా. మీ సీఎం సాబ్ కి ఈ వకీల్ సాబ్ హెచ్చరికగా చెప్పండి.. వచ్చే శాసన సభ సమావేశాల్లోగా నష్టపోయిన రైతులకి రూ.35 వేల పరిహారం అందించకపోతే జనసైనికులతో కలిసి అస్సెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తాం.. అంటూ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ కామెంట్స్ చేశారు.
మీరు గనక రైతులకు సహాయం చేయకపోతే వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయో మేము కూడా చూస్తామని అన్నారు. ఈ విషయంలో ఏ మాత్రం తగ్గేది లేదు అంటూ.. రైతుల కన్నీళ్లు తుడవాడనికి సిద్ధంగా ఉండాలని అన్నారు. ఒకవేళ సమావేశాలను వైజాగ్ లో పెట్టుకున్నా, పులివెందులలో పెట్టుకున్నా మేము ముట్టడించడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయమని పవన్ తెలియజేశారు.