బ్రో అప్డేట్ అదిరింది.. రిలీజ్ డేట్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో సముద్రఖని దర్శకత్వంలో మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. తమిళ్ హిట్ మూవీ వినోదాయ సీతమ్ కి రీమేక్ గా సిద్ధమైన ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. జులై 28న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

ఇదిలా ఉంటే ఈ మూవీలో టైమ్ కి రెప్లికేట్ గా ఉండే పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. అలాగే భక్తుడిగా తేజ్ కనిపించబోతున్నాడు. వీరిద్దరి మధ్య నడిచే ఇంటరెస్టింగ్ ప్రయాణమే ఈ మూవీ కథాంశం. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి ఇంటరెస్టింగ్ టైటిల్ మోషన్ పోస్టర్ ని లాంచ్ చేశారు. ఎస్ ఎస్ తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎలివేషన్ సాంగ్ తో టైటిల్ మోషన్ పోస్టర్ ఆవిష్కరించారు.

ఈ చిత్రానికి బ్రో అనే టైటిల్ ని ఖరారు చేశారు. అలాగే విజువల్ బ్యాగ్రౌండ్ లో టైమ్ ని ఎలివేట్ చేశారు. అలాగే శివుడి రూపాన్ని కూడా ఆవిష్కరించారు. దాంతో పాటు రుద్రుడిని స్మరిస్తూ పాడే హై పిచ్ సాంగ్ తో మోషన్ పోస్టర్ ప్రెజెంట్ చేశారు. దీనిని బట్టి పవన్ కళ్యాణ్ పాత్ర కాలుడుకి అవతారంగా కనిపించబోతోందని అర్ధమవుతోంది.

గోపాల గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ కృష్ణుడి పాత్రలో కనిపించాడు. మరల బ్రో సినిమాలో శివుడి పాత్రధారిగా నటిస్తూ ఉండటం విశేషం. మొత్తానికి ఈ జెనరేషన్ స్టార్ హీరోలలో శివ, కేశవులుగా నటించే ఛాన్స్ ఒక్క పవన్ కళ్యాణ్ కి మాత్రమే రావడం విశేషం. ఈ మూవీలో ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్స్ గా నటిస్తూ ఉన్నారు.

వినోదాయ సీతమ్ కి రీమేక్ గా వస్తోన్న కూడా తెలుగు వెర్షన్ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. దీంతో మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. కచ్చితంగా ఈ సినిమాతో పవన్ స్టార్, తేజ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ పడటం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.