అక్కడా పవన్ కళ్యాణ్ అదే పని.. వకీల్ సాబ్ సెట్ నుంచి ఫోటోలు లీక్

Pawan kalyan Reading book pic leaked from Vakeel saab

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. సంక్రాంతి బరిలో దిగేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది. అయితే వకీల్ సాబ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో.. అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. మధ్యమధ్యలో గ్యాప్‌లు వస్తూ ఉన్నా కూడా వకీల్ సాబ్ షూటింగ్ అలా ముందుకు జరుగుతూనే ఉంది.

ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. ఆ మధ్య రెండు రోజులు నిహారిక పెళ్లి కోసం గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. అలా ఎప్పుడూ కూడా వకీల్ సాబ్ షూటింగ్‌కు దెబ్బ పడుతూనే ఉంది. ఇవే ఓ పెద్ద తలనొప్పిగా మారుతూ ఉంటే.. లీకులు మరో టెన్షన్ పెడుతున్నాయట. తాజాగా పవన్ కళ్యాణ్ ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి. వకీల్ సాబ్ షూటింగ్ చేస్తూ ఉండగా.. మధ్యలో కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి.

Pawan kalyan Reading book pic leaked from Vakeel saab
Pawan kalyan Reading book pic leaked from Vakeel saab

పవన్ కళ్యాణ్‌కు గ్యాప్ దొరికితే ఏదో ఒక పుస్తకం చదువుతూనే ఉంటాడన్న సంగతి తెలిసిందే. తాజాగా వకీల్ సాబ్ షూటింగ్‌లోనూ పవన్ కళ్యాణ్ అదే పని చేస్తున్నాడు. షాట్ గ్యాప్‌లో పవన్ కళ్యాణ్ తన కేరవ్యాన్ దగ్గర బయట కూర్చుని పుస్తకం చదువుతున్నాడు. ఇలా సింపుల్‌గా బుక్ చదువుతున్న ఫోటోనే సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతూ ఉంటే.. టీజర్, ట్రైలర్ వస్తే ఇంకే రేంజ్‌లోఉంటుందో అని అభిమానులు సంబరపడుతున్నారు.