ఇలాగైతే సినిమాలెలా పవన్ కళ్యాణ్.!

పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా తిరుగుతున్నారు. రాజకీయ యాత్రల్లో భాగంగా పవర్ ఫుల్ ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఈ ఉపన్యాసాలే పవన్ చేస్తున్న సినిమాల నిర్మాతల్ని టెన్షన్‌కి గురి చేస్తోంది.

ఈ ప్రసంగాల ఇంపాక్ట్ రిలీజ్ కాబోయే తమ సినిమాలపై ఏమైనా ప్రభావితం చూపిస్తుందా.? అన్నదే వారి టెన్షన్‌కి కారణం. అయితే, ఇలాంటి కాంట్రవర్సీలు ఆయా సినిమాలకి ఎక్స్‌ట్రా అడ్వాంటేజ్ కూడా కావచ్చు.

అంతకంటే ముందు పవన్ తాను చేయాల్సిన సినిమాలు వీలైనంత వేగంగా పూర్తి చేయాలి. ఆయన దగ్గర టైమ్ చాలా తక్కువుంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ’ సినిమాలు ప్రస్తుతం సెట్స్‌పై వున్నాయ్. ఈ సినిమాల షూటింగుల్లో పాల్గొంటూనే రాజకీయ వ్యవహారాలు కూడా చక్కబెట్టేస్తున్నాడు పవన్ కళ్యాణ్.

ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల్లో వారాహి యాత్రలో వున్న పవన్ కళ్యాణ్.. షూటింగులకూ కొంత టైమ్ కేటాయిస్తున్నారట. అందుకోసం వైజాగ్, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకమైన సెట్స్ సిద్ధం చేస్తున్నారట. హైద్రాబాద్‌లో షూటింగ్ చేయాల్సిన పార్ట్ కోసం అప్ అండ్ డౌన్ ఈజీగా ట్రావెల్ చేయగలిగేలా స్పెషల్ ఫ్లైట్ కూడా సిద్ధం చేశారట.