‘బ్రో’ సినిమాది ఓ చిత్రమైన పరిస్థితి. దాదాపు యాభై కోట్ల పైనే ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సెలవిచ్చారు కూడా.
ఇంతకీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడ.? ఆయన జనసేనాని అనే పాత్రలో ప్రస్తుతం చాలా చాలా బిజీగా వున్నారు. ఈ నెల 28న సినిమా రిలీజ్.
ప్రస్తుతానికైతే ప్రమోషన్స్ కోసం సాయి ధరమ్ తేజ్ కష్టపడుతున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ వుంటుందా.? దానికి పవన్ కళ్యాణ్ హాజరవుతారా.? లేదా.? అన్నదానిపై కొంత సస్పెన్స్ వుంది.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ‘నేను రాలేకపోవచ్చు..’ అని నిర్మాతలకి సమాచారం పంపించారట పవన్ కళ్యాణ్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయమై.
వీడియో సందేశం వరకూ.. పవన్ కళ్యాణ్ నుంచి సాధ్యపడుతుందట. దర్శకుడు సముద్రఖని మాత్రం ఎలాగైనా, పవన్ కళ్యాణ్‌తో ప్రమోషన్స్ చేయించాలనే పట్టుదలతో వున్నట్లు తెలుస్తోంది. తెలుగులో దర్శకుడిగా ఆయనకి ఇదే తొలి సినిమా.