పవన్ కళ్యాణ్ – క్రిష్ సినిమా హిందీలోను రిలీజ్ .. అందుకే ఈ ప్లాన్..?

పవన్ కళ్యాణ్ – క్రిష్ సినిమా మీద ఇప్పుడు అందరిలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా.. అది కూడా పీరియాడికల్ సినిమా అంటే అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకాయి. ఇక ఫస్ట్ లుక్ కూడా అంచనాలు మరింతగా పెంచింది. ఇక ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండటం కూడా అంచనాలు పెరగడానికి మరో ముఖ్య కారణం. 17 వ శతాబ్ధం నాటి కథ తో పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతుందని తెలిసిన విషయమే. అందుకే ఈ సినిమాకి ఆ కాలం నాటి పరిస్థితులను చూపించే విధంగా భారి సెట్స్ ని నిర్మించారు.

Pawan Kalyan Teams Up With Director Krish For A Period Drama Releases First Look On Hai 49Th Birthday | Telugu Rajyam

ప్రస్తుతం ఆ సెట్స్ లోనే తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలై శరవేగంగా సాగుతోంది. ఇక పవన్ కళ్యాణ్ కెరీర్ లో 27 వ గా రాబోతున్న ఈ సినిమాకి యూనివర్సల్ టైటిల్ హరి హర వీరమల్లు… వీరమల్లు అన్న టైటిల్స్ ని పరిశీలిస్తున్నారు. విరూపాక్ష అన్న టైటిల్ కూడా మేకర్స్ దృష్ఠిలో ఉంది. మరో ఏ టైటిల్ ఫైనల్ చేస్తారో తెలీదు గాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం టైటిల్ తో పాటు పవన్ కళ్యాణ్ లుక్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండగా ఒక హీరోయిన్ గా నిధి అగర్వాల్ .. మరొక హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ జాక్విలెన్ ఫెర్నాండస్ ని సెలెక్ట్ చేసుకున్నారు.

అయితే బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవడానికి కారణం పవన్ కళ్యాణ్ 27 పలు భాషల్లో పాన్ ఇండియన్ సినిమాగా రిలీజ్ చేయాలన్న ప్లాన్ అని అంటున్నారు. అందుకు తాజాగా వస్తున్న వార్తలు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇప్పటికే క్రిష్ బాలీవుడ్ లో కూడా సినిమాలు తెరకెక్కించి మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. అందుకే ఇప్పుడు ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ని కీలక పాత్రకి తీసుకున్నారట. పవన్ కళ్యాణ్ ఫస్ట్ హిందీ సినిమా అన్న ప్రచారం కూడా జరుగుతోంది. అంతేకాదు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా పవన్ కళ్యాణ్ 27 రిలీజ్ చేస్తారని అంటున్నారు. చూడాలి మరి అధికారకంగా ఈ సినిమాని ఎన్ని భాషల్లో రిలీజ్ చేయబోతున్నారో.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles