ప్రభాస్ సినిమాలపై పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్.!

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన వారాహి విజయ్ యాత్రలో అయితే ఏపీలో గ్రౌండ్ లెవెల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా లేటెస్ట్ గానే పవన్ నటిస్తున్న పవర్ ఫుల్ ప్రాజెక్ట్ “ఓజి” షూటింగ్ కూడా మూడు షెడ్యూల్స్ ని సక్సెస్ ఫుల్ గా అయితే కంప్లీట్ చేసుకున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఇక ఇదిలా ఉండగా ఈ యాత్రలో పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ లేని విధంగా తన తోటి స్టార్ హీరోలపై మాట్లాడడం వారి అందరి ఫ్యాన్స్ ని తన పార్టీ ఓట్లుగా మలిచే ప్రయత్నం చేయడం పవన్ ఫ్యాన్స్ కి నచ్చగా ఇతర హీరోల అభిమానులకి కూడా పవన్ కామెంట్స్ నచ్చడంతో పవన్ పై వారికి పాజిటివ్ వచ్చింది.

అయితే ఇప్పుడు పవన్ ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రచారం చేస్తుండగా అక్కడ పవన్ తో పాటుగా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కి కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. మరి ఈ క్రమంలో పవన్ ప్రభాస్ పై తన సినిమాలపై పలు ఆసక్తికర కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది.

ప్రభాస్ గారు బాహుబలి, ఆదిపురుష్ లాంటి భారీ చిత్రాలు చేస్తున్నారు అని అయితే ఆ చిత్రాలు ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ప్రభాస్ గారు ఎంతో మందికి తన సినిమా ద్వారా ఉపాధి కల్పిస్తున్నారని ఇలాంటి భారీ సినిమాలు మూలాన వేల మందికి పని దొరుకుతుంది ప్రభాస్ టాక్స్ లు కడుతున్నారు వేల మందికి అన్నం పెడుతున్నారు అని పవన్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇవ్వడం ఇపుడు అటు ఆఫ్ లైన్ లో అలాగే ఇటు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది.