గుండుతో పవర్ స్టార్.. దర్శకుడి కండిషన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో మొదటిసారి అత్యదిక ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.  వరుసగా నాలుగు ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు. ఇక వకీల్ సాబ్ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక త్వరలో అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ ను పూర్తి చేసి క్రిష్ ప్రాజెక్టును స్టార్ట్ చేయబోతున్నారు.

అసలు మ్యాటర్ లోకి వస్తే డైరెక్టర్ క్రిష్ సినిమాలో పవన్ నెవర్ బిఫోర్ అనే లుక్ తో కనిపించబోతున్నాడు. అప్పట్లో సినిమాలో పాత్ర కోసం పవన్ కోర మీసాలతో కనిపించాడు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోవడంతో పవన్ మళ్ళీ నార్మల్ లుక్ లోకి రావాల్సి వచ్చింది. పిరియాడిక్ జానర్ లో ఆ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. 

ఇక అయ్యప్పనుమ్ కొశీయుమ్ అయిపోగానే పవన్ మళ్ళీ ఆ సినిమా లుక్ లోకి రానున్నాడు. అయితే అందులో ఒక ఎపిసోడ్ కోసం పవర్ స్టార్ గుండు లుక్ తో కనిపించే అవకాశం ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. సినిమాకు ఆ లుక్ తప్పనిసరి అని తెలుస్తోంది. డైరెక్టర్ మొదట్లోనే ఆ కండిషన్ పెట్టారట. కానీ మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇష్టానికే వదిలేసినట్లు తెలుస్తోంది. అయితే పవన్ కూడా కథకు ఆ లుక్ అవసరమేనని ఒప్పుకున్నట్లు టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.