Bheemla Nayak: భీమ్లా నాయక్ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు అందరికీ ఒక పెద్ద పార్టీ ఇచ్చారు.. ఎం ఎస్ చౌదరి!

Bheemla Nayak: ప్రతి ఒక్కరికి తాను ఒక బెస్ట్ పర్సన్ గా ఊహించుకుంటూ ఉంటారని, నాకు నేను ఒక బాధ్యత గల రచయితగా, దర్శకుడిగా కాస్తోకూస్తో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వ్యక్తిగా పేరు సంపాదించుకున్న వ్యక్తిగా ఉన్నానని, ఒకరి గురించి అబద్ధం చెప్పాలి అని తనకు ఉండదని, ఇంకో ఏమిటంటే ఒకరికి భజన చేయడం తనకు రాదు అని ఆర్టిస్ట్ ఎమ్ ఎస్. చౌదరి తెలిపారు. తాను ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారితో నాలుగు సినిమాలు చేశానని ఆయన చెప్పుకొచ్చారు. ఇకపోతే అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరిగిన కథే ఈ భీమ్లా నాయక్ సినిమా అని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన ఆత్మగౌరవానికి బ్రాండ్ అంబాసిడర్ అని చౌదరి తెలిపారు. పవన్ కళ్యాణ్ గారికి ఆత్మ గౌరవం, ఆత్మసాక్షి చాలా ఎక్కువని, దాంతోపాటు వ్యక్తిత్వం కూడా చాలా విలువ ఇస్తారని చెప్పారు.

తన కింది వాళ్ళతో ఎలా ఉన్నాడు, ఏ సందర్భంలో ఎలా ఉన్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు అని అన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఒక వ్యక్తి క్యారెక్టర్ ని బేరీజు వేస్తామని ఆయన చెప్పారు. అలాంటి విషయానికొస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక మహోన్నతమైన వ్యక్తి అని ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఈ విషయం తానే కాదు ఆయనతో కలిసి పనిచేసిన ఎవరిని అడిగినా కూడా ఇదే మాట చెప్తారని ఆయన స్పష్టం చేశారు. తను భీమ్లా నాయక్ సినిమాలో 35 రోజులు కలిసి పని చేశానని, వాటిలో ఒక్కరోజు మాత్రమే రానా గారితో కలిసి చేశానని చౌదరి తెలిపారు. ఇప్పటివరకు ఆయనతో నాలుగు సినిమాలు చేశానన్న ఆయన, అతనికున్న పరిజ్ఞానం మేరకు పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప వ్యక్తిగా తాను ఊహించుకుంటూ ఉంటానని ఆయన తెలిపారు. ఇక ఆయన చేసిన మంచి పనుల గురించి చెప్పాలంటే చాలాసార్లు ఆయన ప్రత్యక్షంగా అలా చేస్తుండడం చూశానని చౌదరి చెప్పారు. ఒకసారి తన కోసం థియేటర్ దగ్గర ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ అందరికీ కూడా ఆయనే స్వయంగా వాటర్ పాకెట్స్ అందించారని, అక్కడ అలా అందించడానికి చాలా మంది ఉన్నా కూడా ఆయన అందించడం ఎంతో స్ఫూర్తిదాయకంగా కనిపించిందని చౌదరి తెలిపారు. అంతేకాకుండా పావలా శ్యామల గారికి కూడా ఆర్థికంగా సహాయం చేశారని అని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అలా ఆయన కచ్చితంగా సహాయం చేస్తారని పావలా శ్యామల గారిని పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడేలా చేశానని, అలా ఆయన పైన ఎంత నమ్మకం లేకపోతే అలా చేస్తానని చౌదరి చెప్పారు. అలాంటిది ఆయన చాలా మంచి పనులు చేశారని, అంతకన్నా ఎక్కువ మంచి పనులు చేసిన వారు చాలా మంది ఉండొచ్చు కానీ తాను కలిసినవారిలో ఆయనే చాలా గొప్ప వ్యక్తి అని చౌదరి వివరించారు. ఇకపోతే భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తాను లోపలికి కూడా వెళ్ళలేకపోయానని ఆయన నవ్వుతూ చెప్పారు. అక్కడ ఆ జనాలను చూసి లోపలికి వెళ్లలేక అక్కడే ఆగిపోయానని ఆయన తెలిపారు. కానీ తాను లోపలికి వెళ్ళలేకపోయినా, చూడలేకపోయినా గానీ పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత అందరికీ ఓ పెద్ద పార్టీ ఇచ్చారని చౌదరి వివరించారు.