ధర్మం కోసం పోరాటంలో ఆఖరి అధ్యాయం మొదలు..ఎట్టకేలకు వీరమల్లు షూటింగ్ లో జాయిన్ అయిన పవన్ కళ్యాణ్!

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు. చాలా సంవత్సరాల క్రితమే ఈ సినిమా మొదలైనప్పటికీ పవన్ కళ్యాణ్ కి డేట్స్ కుదరకపోవడం వలన లేట్ అవుతూ వచ్చింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ మూవీ చివరి షెడ్యూల్లో జాయిన్ అయినట్లుగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉందని కూడా సమాచారం.

జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పిరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ అని అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను ఇప్పటికే విజయవాడలో చిత్రీకరించారు. పవన్ కళ్యాణ్ ఈ షూటింగ్ ని ఎప్పుడెప్పుడు రీస్టార్ట్ చేస్తారా అని ఆయన ఫ్యాన్స్ తో పాటు మూవీ మేకర్స్ కూడా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చివరి షెడ్యూల్ విజయవాడలో వేసిన సెట్లో ప్లాన్ వేయగా రెండు నెలల లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ షూటింగ్ లో జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ టైం ఇవ్వటమే కష్టం కాబట్టి డేట్స్ ఇచ్చిన రోజుల్లో సాధ్యమైనంతగా ఆయనపై షూటింగ్ చేసేలా టీం ప్లాన్ చేయటం విశేషం. శనివారం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా సెట్ లో పాల్గొన్న విషయాన్ని తెలియజేస్తూ టీం కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసింది. సెట్లో పవన్ లుక్ ని కూడా విడుదల చేసింది మూవీ టీం. ధర్మం కోసం పోరాటంలో ఆఖరి అధ్యయనం మొదలు అని పేర్కొంది టీం. ఒక కొండపై నుంచి చూస్తున్నట్లుగా పవన్ లుక్కు ఉంది ఆయన వీరమల్లు గెటప్ లో ఉన్నారు. చేతిలో ఆ కాలంలో వాడే పిస్తోల్ ఉంది వీరుడిని తలపించేలా పవన్ లుక్ ఉండడం విశేషం.

17వ శతాబ్దంలోని మొగల్ సామ్రాజ్యం నేపథ్యంలో హరిహర వీరమల్లు సినిమాని హిస్టారికల్ మూవీగా రూపొందిస్తున్నారు. బందిపోటు వీరమల్లు పాత్ర ప్రధానంగా ఈ సినిమా సాగబోతుందట. వీరమల్లు పాత్రలో నటిస్తున్న పవన్ కళ్యాణ్ ఔరంగజేబుకి వ్యతిరేకంగా సంపదని కొల్లగొట్టి పేదలకు పంచడం మొగల్స్ నుంచి కోహినూరు వజ్రాన్ని దొంగలించడం ప్రధానంగా ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. రెండు భాగాలుగా తీస్తున్న ఈ సినిమాలోని మొదటి భాగాన్ని వచ్చే ఏడాది మార్చి 20న విడుదల చేస్తున్నారు.