‘ఓజీ’ కోసం ఐటెం సాంగ్.? ‘ఆమె’ వద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ‘ఓజీ’ సినిమా ఇటీవలే స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే వచ్చిన ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే గ్లింప్స్ కూడా అదిరిపోయింది.

శరవేగంగా సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయ్. కాగా, ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఓ అప్‌డేట్ సినీ వర్గాల్లో సర్క్యులేట్ అవుతోంది. ఈ సినిమాలోని  స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వెలీన్ ఫెర్నాండెజ్‌ని తీసుకోవాలనుకుంటున్నారట.

అయితే, జాక్వెలీన్ వద్దు బాబోయ్ అంటున్నారట ఫ్యాన్స్. ‘సాహో’ సినిమాలో జాక్వెలీన్ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకి సుజిత్‌నే దర్శకుడు. ఆ సినిమా రిజల్ట్ తెలిసిందే.

సో, సెంటిమెంట్ పరంగా జాక్వెలీన్‌తో ఐటెం సాంగ్ ఈ సినిమాలో వద్దే వద్దంటూ ఫ్యాన్స్ స్వీట్‌గా కొంచెం ఘాటుగానే వార్నింగ్ ఇస్తున్నారట. చూడాలి మరి, ఏం జరుగుతుందో.!