బ్రో స్పెషల్ సాంగ్.. హీటెక్కించే బ్యూటీ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా బ్రో. సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో కమర్షియల్ టచ్ తోనే ఈ మూవీని సముద్రఖని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించాడు. మామా, అల్లుళ్ళ కాంబినేషన్ కావడంతో బ్రో సినిమా మీద మెగా అభిమానులకి భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక తేజ్, పవన్ అన్యోన్యత గురించి అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో వెండితెరపై ఇద్దరి జోడీ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించడం అదనపు ఆకర్షణ. ఈ నేపథ్యంలో సినిమాపై ఇప్పటికే భారీగా బిజినెస్ జరిగింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఏకంగా 120 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తోంది.

ఇక ఈ సినిమాలో అదనపు ఆకర్షణగా విశ్వసుందరి ఊర్వశీ రౌతేలా కూడా కనిపించబోతోంది. ఇప్పటికే వాల్తేర్ వీరయ్య సినిమాలో మెగాస్టార్ తో టైటిల్ సాంగ్ లో స్టెప్పులు వేసిన ఊర్వశీ ఇప్పుడు పవర్ స్టార్, తేజ్ తో కలిపి డాన్స్ వేయబోతోంది. పబ్ సాంగ్ గా దీనిని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సాంగ్ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని టాక్.

ఇక ఈ సినిమాలో కేతిక శర్మ సాయి ధరమ్ తేజ్ కి జోడీగా నటిస్తోంది. ప్రియా ప్రకాశ్ వారియర్ మరో కీలక పాత్రలో కనిపిస్తోంది. అలాగే సీనియర్ యాక్టర్ తనికెళ్ళ భరణి, స్టార్ కమెడియన్ బ్రహ్మానందం పాత్రలు చాలా కీలకంగా ఉంటాయని తెలుస్తోంది. ఫిక్షనల్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని సముద్రఖని ఆవిష్కరిస్తున్నారు. ఇప్పటికే తమిళంలో వినోదయ సీతమ్ టైటిల్ తో ఈ మూవీ వచ్చి సూపర్ హిట్ అయ్యింది.

ఇప్పుడు అదే కథకి కాస్తా కమర్షియల్ రంగులు అద్ది భారీ బడ్జెట్ తో పవర్ స్టార్ ని దేవుడిగా చూపిస్తూ తెలుగులో చూపిస్తున్నారు. గోపాల గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ కృష్ణుడి పాత్రలో కనిపించి మెప్పించారు. అది సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు శివుడికి ప్రతిరూపం అయిన కాలుడిగా బ్రో చిత్రంలో అలరించబోతున్నాడు.