పవర్ స్టార్ బ్రో అవతార్ కి భలే డిమాండ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పేరు ఉంటే చాలు సినిమాకి ఆటోమేటిక్ గా కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేస్తోంది. టాలీవుడ్ లో పబ్లిసిటీ కోసం తక్కువ ఖర్చు చేసే సినిమాలు అంటే పవన్ కళ్యాణ్ వి అని చెప్పాలేమో. పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా తమ సినిమాలని ప్రమోట్ చేసుకోవడానికి ప్రత్యేక ఇంటర్వ్యూలు సైతం ఇస్తూ ఉంటారు. అయితే ఇలాంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ కి దూరంగా ఉంటారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సముద్రఖని దర్శకత్వంలో బ్రో మూవీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతోంది. జులై 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. భారీ బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. పవన్ కళ్యాణ్, తేజ్ ఈ చిత్రంలో లీడ్ రోల్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ టైమ్ కి రెప్లికేట్ గా ఉంటుందంట.

ఇక తేజ్ కి జోడీగా కేతిక శర్మ నటిస్తోంది. ప్రియా ప్రకాశ్ వారియర్ మరో ఇంటరెస్టింగ్ రోల్ లో కనిపించబోతోంది. నేడు బ్రో మూవీ టీజర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. టైమ్ కూడా ఫిక్స్ చేశారు. తాజాగా టీజర్ కి పవన్ కళ్యాణ్ డబ్బింగ్ ఫినిష్ చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన బిజినెస్ ఇప్పటికే స్టార్ట్ అయ్యిందంట.

ప్రభాస్ మార్కెట్ ని దృష్టిలో ఉంచుకొని రైట్స్ కోసం డిస్టిబ్యూటర్స్ పోటీ పడుతున్నారు. పవర్ స్టార్ నుంచి వచ్చిన చివరి చిత్రం భీమ్లా నాయక్ మంచి హిట్ అయ్యింది. ఈ నేపథ్యంలో బ్రో మూవీకి మంది డిమాండ్ ఏర్పడింది. ఈ మూవీ నైజాం రైట్స్ కోసం ఓ యంగ్ ప్రొడ్యూసర్ ఏకంగా 30 కోట్లు ఆఫర్ చేసారంట. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. దిల్ రాజు అయితే పోటీలో లేనట్లు తెలుస్తోంది.

ఓవరాల్ గా ఈ చిత్రంపై 120 నుంచి 130 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్ కావడంతో కచ్చితంగా పవర్ స్టార్ అభిమానులకి భారీ అంచనాలు ఉన్నాయి. సముద్రఖని ఈ చిత్రాన్ని పవర్ స్టార్ ఇమేజ్ తగ్గట్లుగా మార్పులు చేసి తెరకెక్కించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ కి డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించడం కూడా బ్రోపై పాజిటివ్ వైబ్ పెరగడానికి కారణమని చెప్పొచ్చు.