పవన్ కళ్యాణ్ బయోపిక్.! దర్శకుడు ఆయనేనా.?

బయోపిక్ కాని బయోపిక్ అట.! 2024 ఎన్నికల కోసం సిద్ధమవనుందట. సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ కొత్త సినిమాకి సైన్ చేసేశారంటూ ప్రచారం జరుగుతోంది. సైన్ చేయడమేంటి.? అది స్వయంగా పవన్ కళ్యాణ్ నిర్మించే చిత్రమట. 2024 ఎన్నికలే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ఓ సినిమాని నిర్మించే ఆలోచనలో వున్నట్లు తెలిసింది. ‘వకీల్ సాబ్’ దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్తానాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారట. ప్రధానంగా, ప్రజారాజ్యం పార్టీ నాటినుంచి పవన్ కళ్యాణ్ రాజకీయ రంగంలో ఏమేం చేశారు, గెలకపోయినా.. ప్రజల కోసం ఏమేం చేస్తున్నారు.? అన్న అంశాలు ఆ సినిమాలో వుంటాయట. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆర్థిక సాయం చుట్టూనే సినిమా వుండబోతోందని తెలుస్తోంది. చాలా కాలం క్రిందటే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే బ్యానర్ స్థాపించారు పవన్ కళ్యాణ్. ఆ బ్యానఱ్‌లో వేరే బ్యానర్లతో కలిసి కొన్ని సినిమాలు కూడా చేశారు.