మెగాస్టార్ గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్!

మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో నటిస్తున్నటువంటి చిత్రం గాడ్ ఫాదర్.ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకుని త్వరలోనే ప్రీ రిలీజ్ వేడుకకు సిద్ధమవుతుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరవుతారనే విషయంపై చర్చలు మొదలయ్యాయి. అయితే సోషల్ మీడియా కథనాల ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ఈవెంట్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వస్తున్నారంటే మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా విషయంలో కూడా ఫ్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరుకానున్నారనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ఏకంగా ఏపీ సీఎం జగన్ వస్తారంటూ పెద్ద ఎత్తున వార్తలు సృష్టించారు. గాడ్ ఫాదర్ సినిమాకి కూడా పవన్ హాజరవుతారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్ దగ్గర చర్చించినట్లు కూడా తెలుస్తోంది.

ఇక మెగాస్టార్ చిరంజీవి తన సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించగా పవన్ కళ్యాణ్ మాత్రం సున్నితంగా తిరస్కరించే అవకాశం ఎక్కువగా ఉంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో సినిమా ప్రీ రిలీజ్ వేడుక కోసం వస్తే ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ రాజుకుంటుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం.ఇలా ఆలోచించే పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు దూరంగా ఉండాలని భావించినప్పటికీ చిరంజీవి మాత్రం రాజకీయాలతో సంబంధం లేకుండా కేవలం సినిమాలో పరంగా తన తమ్ముడిని ఆహ్వానించి ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట మరి ఈ కార్యక్రమానికి ఎవరు అతిథిగా వస్తారో తెలియాల్సి ఉంటుంది.