పవన్ కళ్యాణ్ ‘ఓజీ’: ఒరిజినల్ స్క్రిప్టేనా.?

పవన్ కళ్యాణ్ తాజా చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావడంతో, ఇది ఒరిజినల్ కథేనా.? లేదంటే, ఏదన్నా ఫ్రీమేక్ అనుకోవచ్చా.? అన్న అనుమానాలు షురూ అయ్యాయి.

‘సాహో’ సినిమాని ఓ విదేశాల నుంచి ఎత్తుకొచ్చేశాడు సుజీత్. ప్రభాస్‌తో అత్యంత భారీ బడ్జెట్‌తో తీసిన ‘సాహో’ బొక్కబోర్లా పడటంతో, తదుపరి సినిమా కోసం చాలా టైమ్ తీసుకోవాల్సి వచ్చింది దర్శకుడు సుజీత్‌కి.

అయితే, సుజీత్ మేకింగ్ స్టైల్‌కి చాలామంది ఫిదా అయ్యారనుకోండి అప్పట్లో.. అది వేరే సంగతి. ఇంతకీ, ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) కథా కమామిషు ఏంటి.? అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇది సుజీత్ ఒరిజినల్ స్క్రిప్ట్ అని తెలుస్తోంది.

చాలాకాలం క్రితమే.. అది కూడా పవన్ కళ్యాణ్ కోసమే ఈ స్క్రిప్టుని సుజీత్ సిద్ధం చేసుకున్నాడట. తెలుగు తెరపై ఇంతవకు ముందెన్నడూ చూడని కథ.. అని అంటున్నారు. ‘సాహో’ ఫెయిల్యూర్‌తో వచ్చిన బ్యాడ్‌నేమ్ చెరిపేసుకునేందుకు సుజీత్ పట్టుదలతో వున్నాడట. సినిమా నిర్మాణానికి మాత్రం ఎక్కువ సమయమే పట్టే అవకాశముందని సమాచారమ్.