ప్రభాస్‌తో పవన్ కళ్యాణ్ మంతనాలట.! నిజమేనా.?

డార్లింగ్ ప్రభాస్, తెలుగు సినీ పరిశ్రమలో అందరితోనూ అత్యంత సన్నిహితంగా వుంటాడన్న విషయం తెలిసిందే. కానీ, ప్రభాస్ అభిమానుల్లో కొందరు అలా కాదు.! వారి లెక్క వేరు.

నిజానికి, హీరోల అభిమానుల్లో కొందరు మరీ అగ్రెసివ్‌గా వుంటారు, వల్గర్‌గా బిహేవ్ చేస్తుంటారు. ఈ లిస్టులో ఆ హీరో, ఈ హీరో అని కాదు.. దాదాపు అందరు హీరోల అభిమానులూ వుంటారు.

కానీ, ఈ మధ్య ప్రభాస్ అభిమానులు ఎక్కువగా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. దాంతో, అభిమానుల్ని ప్రభాస్ ఈ మధ్యనే వారించాడట. మరోపక్క, పవన్ కళ్యాణ్ కూడా తన అభిమానుల్ని వారిస్తూ వస్తున్నారు.

త్వరలో పవన్ కళ్యాణ్, ప్రభాస్ కలిసి అభిమానులకు.. ఓ సందేశం ఇవ్వాలనే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. ఎన్టీయార్, రామ్ చరణ్ అలాగే చిరంజీవి, చరణ్.. ఇలా ప్రముఖ హీరోలంతా అభిమానుల మధ్య మనస్పర్ధల్ని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ఇదంతా నిజమే అయితే మంచిదేగా.! తెలుగు సినిమా స్థాయి పెరిగిన దరిమిలా అభిమానుల్ని ఆయా హీరోలు కంట్రోల్‌లో పెట్టుకోవడం మంచి పరిణామమే.!