Mithun Chakraborty: మిథున్‌కు తోటి నటుల ప్రశంసలు: ఫాల్కే అవార్డుపై పవన్‌, బాలయ్య హర్షం

Mithun Chakraborty: అత్యంత ప్రతిష్టాత్మకమైన ’దాదా సాహెబ్‌ ఫాల్కే’ అవార్డుకు ఎంపికైన మిథున్‌ చక్రవర్తికి ప్రస్తుతం శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం మరియు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మిథున్‌ చక్రవర్తికి అభినందనలు తెలుపుతూ ఓ ప్రకటనను విడుదల చేశారు. ప్రముఖ నటులు, రాజ్యసభ సభ్యులు మిథున్‌ చక్రవర్తిగారికి దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషాన్ని కలిగించింది. మిథున్‌ చక్రవర్తిగారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

హిందీ, బెంగాలీ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. 80వ దశకంలో దేశవ్యాప్తంగా యువతపై ఆయన ప్రభావం ఉంది. ’డిస్కో డ్యాన్సర్‌’ చిత్రం ద్వారా ఆయన నృత్య శైలులు ఉర్రూతలూగించాయి. ’ఐ యామ్‌ ఏ డిస్కో డ్యాన్సర్‌…’ అనే పాటను ఎవరూ మరచిపోలేరు. అని పేర్కొన్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణ ’దాదా సాహెబ్‌ ఫాల్కే’ పురస్కారానికి ఎంపికైన మిథున్‌ చక్రవర్తికి అభినందనలు తెలుపుతూ ఓ లేఖను విడుదల చేశారు.

ఇందులో..విలక్షణ నటుడు, మిత్రుడు మిథున్‌ చక్రవర్తికి ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు ప్రకటించడం హర్షించదగ్గ విషయం. తొలి చిత్రం ’మృగయా’తోనే నటునిగా తనదైన బాణీ పలికించి, జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా నిలిచారు మిథున్‌ చక్రవర్తి. ఆరంభంలో వాస్తవ చిత్రాలతో సాగినా, తరువాత బాలీవుడ్‌ కమర్షియల్‌ మూవీస్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు మిథున్‌. ముఖ్యంగా ’డిస్కో డాన్స్‌’కు మిథున్‌ చక్రవర్తి విశేషమైన పేరు సంపాదించి పెట్టారు. మిథున్‌ చక్రవర్తితో నాకు చిత్రబంధం ఉంది` అదెలాగంటే నేను సోలో హీరోగా బయటి సంస్థల చిత్రాలలో నటించడానికి తొలిసారి కెమెరా ముందుకు వచ్చిన చిత్రం ’డిస్కో కింగ్‌’.

Mithun Chakraborty: మిథున్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు… ప్రధాని మోదీ అభినందనలు

ఈ చిత్రానికి మిథున్‌ చక్రవర్తి హిందీ సినిమా ’డిస్కో డాన్సర్‌’ ఆధారం. అలా మా ఇద్దరికీ చిత్రబంధం ఉంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యుత్తమమైన ’దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డుకు ఎంపికైన మిథున్‌ చక్రవర్తికి నా హృదయపూర్వక శుభాభినందనలు. మిథున్‌ నటునిగా మరెన్నో విలక్షణమైన పాత్రలలో మురిపిస్తూ సాగాలని ఆశిస్తున్నాను..‘ అంటూ నందమూరి బాలకృష్ణ ఈ లేఖలో పేర్కొన్నారు.

BJP Madhavi Latha Exclusive Interview | Pawan Kalyan | Perni Nani | Tirumala Laddu | Ys Jagan | TR