కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే పవన్ కు ప్యాకేజీ అవసరం లేదు… నాగబాబు కామెంట్స్ వైరల్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతూనే మరోవైపు జనసేన పార్టీని స్థాపించి పెద్ద ఎత్తున పార్టీ కోసం కృషి చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గురించి తరచూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది ఈయన సొంతంగా పోరాటం చేయకుండా ప్యాకేజీ కోసం ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకుంటారు అంటూ తరచూ తననీ ట్రోల్ చేయడం చూస్తున్నాము. ఈ క్రమంలోనే గత మూడు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యారని, త్వరలోనే పొత్తు గురించి కూడా ప్రకటిస్తారంటూ వైసీపీ నేతలు మాట్లాడారు.

ఇలా తరచూ పవన్ కళ్యాణ్ గురించి ప్యాకేజీ గురించి మాట్లాడటంతో మెగా బ్రదర్ నాగబాబు ఈ వ్యాఖ్యలపై స్పందించి వైసిపి నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకుంటున్నారనీ చెప్పేవాళ్లు మీ అమ్మ మొగుడు వచ్చి పవన్ కు ప్యాకేజీ ఇచ్చారా అంటూ నాగబాబు ప్రశ్నించారు.పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకి కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అలాంటి తనకు ప్యాకేజీతో ఏమాత్రం అవసరం లేదని నాగబాబు తెలిపారు.

కొందరు నేతల మాదిరిగా తనకు లక్షల కోట్ల ఆస్తులు లేవని ఉన్నదాంట్లోనే 10 మందితోపంచుకుంటున్నారని ఇకపై ఇలాంటి సన్నాసి మాటలు ఆపి మీరు కూడా మీకున్న దాంట్లో పదిమందితో పంచుకోవడానికి ప్రయత్నించండి అంటూ నాగబాబు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ గురించి మాట్లాడే వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం నాగబాబు పవన్ ప్యాకేజీ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.