ఇండస్ట్రీ టాక్ : ప్రభాస్ స్ట్రాటజీలో పవన్ కళ్యాణ్.?

టాలీవుడ్ దగ్గర ఉన్న బిగ్గెస్ట్ స్టార్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లు కూడా ఒకరు. మరి ఇద్దరు కూడా ఇప్పుడు ఆల్ మోస్ట్ ఒకే తరహా లైనప్ తో రెడీ అవుతూ ఉండగా ఇద్దరు సినిమాలు కూడా ఒకే తరహా స్ట్రాటజీ లో సినిమాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ప్రభాస్ పలు భారీ చిత్రాలు పాన్ ఇండియా లెవెల్లో చేస్తుండగా మరోపక్క పవన్ కళ్యాణ్ కూడా హరిహర వీరమల్లు అనే భారీ చిత్రం దర్శకుడు క్రిష్ తో చేస్తున్నాడు అలాగే ఇంకోపక్క అయితే మరికొన్ని సినిమాలు కూడా సిద్ధం చేసుకున్నాడు. మరి వీటిలో వినోదయ సైతం రీమేక్ కూడా ఉండగా ఈ సినిమా లేటెస్ట్ గా లైనప్ లోకి మళ్ళీ వచ్చింది.

అయితే ఈ సినిమాని ప్రభాస్ ఎలాంటి హంగామా లేకుండా ఓ సినిమాని చేసేస్తున్నాడు. అదే దర్శకుడు మారుతీ తో చేస్తున్న సినిమా కాగా ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా స్టార్ట్ అయ్యిపోయింది. అయితే ఈ చిత్రం టైప్ లోనే పవన్ రీమేక్ కూడా ఆల్రెడీ లాంచ్ అయ్యిపోయింది అలాగే షూట్ కి సిద్ధం అయ్యిపోయింది.

మరి దీనితో అయితే పవన్ సినిమా కూడా ప్రభాస్ సినిమాలానే అనౌన్సమెంట్ లాంటివి ఏం లేకుండానే షూటింగ్ కూడా చేసేసుకోనున్నాయని తెలుస్తుంది. దీనితో అయితే ఇలా పవన్ ప్రభాస్ స్ట్రాటజీ ని ఫాలో అవుతున్నాడని చెప్పొచ్చు.