Pawan Kalyan: తొలిప్రేమ సినిమా రెమ్యూనరేషన్ తో పవన్ అలాంటి పని చేశారా… ఇదేం పిచ్చి రా బాబు?

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంత చేసుకున్న వారిలో నటుడు పవన్ కళ్యాణ్ ఒకరు. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి తన అన్నయ్య చిరంజీవి తమ్ముడిగా వచ్చినప్పటికీ తనకంటూ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ ఈయన మాత్రం ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలపై ఆసక్తితో జనసేన పార్టీని స్థాపించి రాజకీయాలలోకి అడుగుపెట్టారు. ఇక రాజకీయాలలో భాగంగా ఈయన ప్రస్తుత డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న సంగతి తెలిసిందే.

ఇలా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉండగా సినిమాలకు కూడా దూరమయ్యారు. కేవలం ఎన్నికలకు ముందు ఆయన కమిట్ అయిన సినిమా షూటింగ్ పనులలో మాత్రమే పాల్గొంటూ ఉన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి మాట్లాడుతూ ఆయన నటించిన తొలిప్రేమ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

నేను కొన్ని సంవత్సరాల క్రితం తొలిప్రేమ సినిమాలో నటించాను ఆ సినిమా కోసం నాకు 15 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఆ డబ్బుతో ఏం చేయాలని ఆలోచిస్తున్న నేను ఒకరోజు ఒక బుక్ స్టాల్ దగ్గరకు వెళ్లాను అయితే అక్కడ ఎంతో మంచి మంచి బుక్స్ ఉండటం చూసి ఏకంగా లక్షన్నర విలువ చేసే పుస్తకాలను కొనుగోలు చేసి నా రూమంతా సర్ది పెట్టానని పవన్ తెలిపారు.

ఇలా నా గదిలో ఎన్నో మంచి పుస్తకాలు ఉండటం చూసి తనకు చాలా సంతోషం కలిగిందని మూడు రోజులపాటు నిద్ర కూడా లేకుండా నాకు నచ్చిన పుస్తకాలు అన్నిటిని చదువుతూ చాలా సంతోషపడ్డానని పవన్ తెలిపారు. ఇలా తన సినిమా రెమ్యూనరేషన్ లో లక్షలు ఖర్చు చేసి ఈయన పుస్తకాలు కొనుగోలు చేశానని చెప్పడంతో ఈయన మరీ ఇంత పుస్తకాల పురుగా.. బుక్స్ చదవడం అంటే అంత పిచ్చి ఏంటి అంటూ అభిమానులు కూడా షాక్ అవుతున్నారు.