బుల్లితెరపై హిట్టయిన డిజాస్టర్ “ఆదిపురుష్”

ఈ ఏడాది ఇండియన్ సినిమా దగ్గర వచ్చిన పలు భారీ చిత్రాల్లో అయితే బాలీవుడ్ నుంచి వచ్చి సెన్సేషన్ ని సెట్ చేసినవే ఎక్కువ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఈ చిత్రాల్లో అయితే టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మొదటి బాలీవుడ్ చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి.

అయితే ఈ చిత్రం ఎన్నో అంచనాలు అందుమా వచ్చినప్పటికీ వాటిని అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. కానీ ఆ  400 కోట్లకి పైగా వరల్డ్ వైడ్ గా అందుకున్న ఈ చిత్రం తెలుగులో కూడా డే 4 నుంచే చతికిల పడిపోయింది. దీనితో ప్రభాస్ కెరీర్ లో మరో ప్లాప్ గా నిలిచిపోయిన ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ గా తెలుగు బుల్లితెరపై మాత్రం సత్తా చాటింది.

కాగా ఈ చిత్రాన్ని గత దసరా కానుకగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా అయితే టెలికాస్ట్ చేయగా దీనికి అనూహ్యంగా 9.5 టీఆర్పీ రేటింగ్ పాయింట్స్ దక్కాయి. దీనితో ఈ చిత్రం మాత్రం బుల్లితెర మీద హిట్ అయ్యిందనే చెప్పాలి. ఇక రీసెంట్ గా వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ ల “బ్రో” చిత్రం అన్ని ప్రమోషన్స్ చేసుకున్నప్పటికీ రేటింగ్ 7 దాటలేదు.

అలాంటిది ఆదిపురుష్ కి 9 కి పైగా వచ్చింది అంటే అది డెఫినెట్ గా హిట్ అనే చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ రామాయణం ఆధారంగా తెరకెక్కించగా కృతి సనన్ హీరోయిన్ గా నటించింది.