కూతురి కోసం కాస్త టైమ్ కేటాయించిన ప‌వన్.. మూడు రోజుల పాటు ప్యాలెస్‌లో బ‌స‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ఒక‌ప్పుడు మెగాస్టార్ చిరంజీవి బ్ర‌ద‌ర్, లేదంటే టాలీవుడ్ న‌టుడు అనేవాళ్లు. ఇప్పుడు ఆయ‌న జ‌న‌సేన అధ్య‌క్షుడు. సినిమాలు, రాజ‌కీయాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. రెండేళ్ల త‌ర్వాత వ‌కీల్ సాబ్ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ప‌వ‌న్ ప్ర‌స్తుతం వ‌రుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం,మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌నున్నాడు . ఈ చిత్రానికి సాగ‌ర్‌చంద్ర దర్శకత్వం వహించనున్నారు

పవ‌న్ తొలిసారి జీహెచ్ఎంసీ ఎల‌క్ష‌న్స్‌లో త‌న పార్టీని బ‌రిలోకి దింపుతున్నాడు. డిసెంబ‌ర్ 1న జ‌ర‌గ‌నున్న ఈ ఎల‌క్ష‌న్స్‌కి సంబంధించిన ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉన్నాడు. నాలుగో తేదీన ఈ హ‌డావిడి ముగియ‌నుండ‌గా, డిసెంబ‌ర్ 7న‌ రాజ‌స్థాన్ వెళ్ల‌నున్నాడు. నిహారిక పెళ్ళి ఏర్పాట్ల‌న్నింటిని ప‌వ‌న్ ద‌గ్గ‌రుండి ప‌రిశీలించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. మూడు రోజుల పాటు ప‌వ‌న్ అక్క‌డే బ‌స చేయ‌నుండ‌గా, పెళ్లి పూర్త‌య్యాక తిరిగి హైద‌రాబాద్‌కి రానున్నారు. వ‌చ్చాక క్రిష్ చిత్రంతో పాటు హ‌రీష్ శంక‌ర్ సినిమా మొద‌లు పెట్ట‌నున్న‌ట్టు తెలుస్తుంది.

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమార్తె నిహారిక‌.. చైత‌న్య‌ని డిసెంబ‌ర్ 7న ఉద‌య్ పూర్ ప్యాలెస్‌లో వివాహం చేసుకోనుంది. ఈ కార్య‌క్ర‌మానికి కేవ‌లం కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌రు కానున్న‌ట్టు తెలుస్తుంది. హైద‌రాబాద్‌లో గ్రాండ్ రిసెప్ష‌న్ ఏర్పాటు చేయ‌నుండ‌గా, ఈ కార్య‌క్ర‌మానికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కూడా హాజ‌రు కానున్నారు. ఏదైమ‌న ఎంగేజ్‌మెంట్‌కు డుమ్మా కొట్టిన ప‌వ‌న్ పెళ్లికి మూడు రోజుల ముందే వ‌స్తాన‌న‌డం నిహారిక‌కి చెప్ప‌లేనంత ఆనందాన్ని క‌లిగిస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.