రమ్య రఘుపతిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పవిత్ర లోకేష్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవిత్ర లోకేష్ నటుడు నరేష్ తో రిలేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఈమే నరేష్ తో లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉండడంతో వీరి గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇకపోతే వీరిద్దరి వ్యవహారం కారణంగా నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి పెద్ద ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.ఇకపోతే నరేష్ పవిత్ర గురించి ఈ విధమైనటువంటి వార్తలు తరచూ రావడంతో పవిత్ర లోకేష్ ఏకంగా తన గురించి అసభ్యకరంగా వార్తలు రాస్తూ ప్రచారం చేస్తున్నటువంటి పలు యూట్యూబ్ ఛానల్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలోనే ఈమె కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తన గురించి తప్పుడు కథనాలు ప్రచురించడమే కాకుండా తన ఫోటోలను మార్ఫింగ్ చేసి తనపట్ల అసత్యపు వార్తలను ప్రచారం చేస్తున్నారంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి పై కూడా ఈమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. తన గురించి సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు రావడం వెనుక రమ్య రఘుపతి ఉన్నారని ఆరోపించారు.

ఈ క్రమంలోనే పవిత్ర లోకేష్ రమ్య గురించి మాట్లాడుతూ రమ్య నరేష్ మధ్య కుటుంబ వివాదాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రమ్య తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, పలు యూట్యూబ్ ఛానల్ ను అడ్డుపెట్టుకొని తనని కించపరుస్తున్నారనీ,నరేష్ తన ఫోటోలను మార్ఫింగ్ చేసి తనను అ ప్రతిష్టపాలు చేస్తున్నారంటూ పవిత్ర లోకేష్ రమ్యరగుపతి పట్ల కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .మరి ఈ విషయంపై నరేష్ భార్య రమ్య రఘుపతి ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.