Pavan Kalyan : పవన్ సినిమాతో అకీరా తెరంగేట్రం…. జోరుగా ప్రచారం…!

Pavan Kalyan : పవన్ కళ్యాణ్ తాజా గా నటిస్తున్న హరిహర వీరమల్లు నుండి వీడియో విడుదల అయి అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా గురించి ఇపుడు మరో ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది అదే పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా ఈ సినిమా లో నటించబోతున్నాడు. ఇక ఈ వార్త ఇపుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

సినిమాలో యంగ్ పవన్ కల్యాణ్ గా అకీరా నందన్ నటించనున్నారని ప్రస్తుతం ఈ పాత్రలో నటించడం కోసం అకీరా ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారని సమాచారం వినిపిస్తోంది. అకిరాని పవన్ యంగ్ పాత్రలో చూపించాలని డైరెక్టర్ క్రిష్ కి మెరుపులాంటి ఆలోచన వచ్చిందట. ఆ ఆలోచనని వెంటనే పవన్ కళ్యాణ్ కు చెప్పడం. ఆ ఆలోచన నచ్చడంతో పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని చెబుతున్నారు. ఇక హరి హర వీర మల్లు షూటింగ్ కోసం గురువారం హైదరాబాద్ లో పద్మశ్రీ తోట తరణి పర్యవేక్షణలో ప్రత్యేకంగా ఈ సినిమా కోసం భారీ సెట్ లను నిర్మించారు. ఆ సెట్ లలో కీలక ఘట్టాల సన్నివేశాలతో ఈ సినిమా షూటింగ్ ని దర్శకుడు క్రిష్ ప్రారంభించారు.

హరి హర వీరమల్లుగా రాబిన్ హుడ్ లాంటి గజ దొంగ పాత్రలో పవన్ కల్యాణ్ నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ కీలక పాత్రలో బాలీవుడ్ హాట్ లేడీ నర్గీస్ ఫక్రీ నటిస్తున్నారు. ఇక అకీరా నందన్ ఈ సినిమాలో నటించడం కోసం యాక్షన్ సన్నివేశాల కోసం శిక్షణ కూడా తీసుకుంటున్నట్టు తెలియడంతో పవన్ అభిమానుల్లో సందడి మొదలయింది.ఈ మధ్యనే నెట్టింట్లో దర్శనమిచ్చిన అకీరా వీడియోలు వైరల్ అవ్వడంతో అకీరా సినిమాల్లోకి వస్తున్నాడా అంటూ అభిమానులు ప్రశ్నించడంతో రేణుదేశాయ్ అలాంటిదేమి లేదని స్పష్టం చేసింది.అయితే ఇపుడు అకీరా హరిహర సినిమా తో ఎంట్రీ ఇస్తున్నాడా లేదా అన్నది చర్చకు దారితీసింది.