Pavan Kalyan : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లా మధ్య స్నేహం గురించి మళ్ళీ కొత్తగా చెప్పనక్కరలేదు. జల్సా సినిమా అప్పటినుండి వీరి స్నేహం మొదలై బలపడుతూనే ఉంది. పవన్ వ్యక్తిగత విషయాల్లో కూడా త్రివిక్రమ్ సలహాలు ఇస్తారు. ఇక రాజకీయ రంగప్రవేశం తర్వాత కూడా పవన్ కు సలహాలు ఇస్తారు త్రివిక్రమ్.
ఇక పవన్ సినిమాల ఎంపికలో త్రివిక్రమ్ కీలక పాత్ర పోషిస్తారు. రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల కథల ఎంపిక త్రివిక్రమ్ చూసుకుంటారు. ఇక మొన్నటి విడుదలైన భీమ్లా నాయక్ కు డైరెక్టర్ త్రివిక్రమ్ కాకపోయినా మాటలు, కథనం అందించాడు.ప్రస్తుతం పవన్ ‘హరిహర వీరమల్లు’ అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. వాటి కంటే ముందే ‘వినోదయ సీతమ్’ అనే తమిళ చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచనలో కూడా పవన్ ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగా.. గురువారం నాడు హైదరాబాద్ లో నిర్వహించిన ఓ పుస్తకం ఆవిష్కరణలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
ఈ క్రమంలో ఆయన త్రివిక్రమ్ గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ‘నాకు, త్రివిక్రమ్ గారికి అన్ని విషయాల్లోనూ సారూప్యతలు ఉంటాయి. ఒక్క పుస్తకాల విషయంలోనే మా ఇద్దరి మధ్య తేడాలు ఉంటాయి. మేము ఇద్దరం కూడా పుస్తకాల పురుగులమే.కానీ నా దగ్గర ఉన్న పుస్తకాల్లో త్రివిక్రమ్ గారికి ఏమైనా నచ్చి ఇవ్వమని అడిగితే నేను అస్సలు ఇవ్వను. ఓ సినిమా ఫ్రీగా అయినా చేస్తాను కానీ ఆయన అడిగిన పుస్తకాలు మాత్రం ఇవ్వలేను’ అంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్.