Pavan kalyan : హరి హర వీరమల్లు అక్టోబర్ లో రానున్నాడా…!

Pavan Kalyan:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య వరుస సినిమాలను షురూ చేసారు. అజ్ఞాతవాసి వాసి సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న పవన్ మళ్ళీ రాజకీయాల్లో బిజీ అయ్యారు. ఇక మళ్ళీ వకీల్ సాబ్ సినిమా ద్వారా మళ్ళీ హాట్ కొట్టిన పవన్ వెంటనే భీమ్లా నాయక్ తో అభిమానులకు పండగ చేసారు. రీమేక్ సినిమాలను ఎక్కువగా తీస్తున్న పవన్ కళ్యాణ్ మళ్ళీ అదే బాటలో ఇంకో రీమేక్ సినిమాను ఓకే చేసారు.ఇలా వరుస సినిమాలను చేస్తూ బిజీ అయ్యారు.ఇది ఇలా ఉంటే ఇప్పటికే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.

హిస్టారికల్ డ్రామాగా రానున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తాడట. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా 16 వ శతాబ్దం కాలం నాటి కథాంశంతో చేస్తున్నారట. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి ఒక కొత్త వార్త వినిపిస్తోంది.క్రిష్ ఈ సినిమాను కూడా వీలైనంత తొందరగా పూర్తి చేసి ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నాడు. కానీ కరోనా కారణంగా, ఇంకా పవన్ కళ్యాణ్ కి చిన్న సినిమాలతో బిజీగా ఉండటం వలన ఈ సినిమా విడుదల మరింత ఆలస్యం అయింది.

అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరొక రీమేక్ సినిమా కూడా చేస్తుండటంతో ఈ సినిమాని వీలైనంత తొందరగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.హరిహర వీరమల్లు సినిమాను రిలీజ్ డేట్ పై కూడా ఇటీవల చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఆగస్టు సెప్టెంబర్ సమయానికి సినిమా షూటింగ్ పూర్తి చేసి అక్టోబర్ 5న విడుదల చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఇటీవల నిర్మాత ఏఎం రత్నం దర్శకుడితో కలిసి ఆ డేట్ గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. దర్శకుడిపై సినిమాని వీలైనంత తొందరగా విడుదల చేసి విజయం సాధించాలని అనుకుంటున్నారట ఎందుకంటే చివరగా చేసినా కొండపొలం సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అందుకని ఈ సినిమాతో మంచి విజయం అందుకోవాలని చూస్తున్నారట. కాబట్టి అన్నీ కుదిరితే అక్టోబర్ 5 నాటికి హరిహర వీరమల్లు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.