Pavan Kalyan: తెర పై ఎన్టీఆర్, చెర్రీ ఎలా కనిపిస్తారో…. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన పవర్ స్టార్…!

Pavan Kalyan: దర్శక ధీరుడు రాజమౌళి ఎన్టీఆర్ చరణ్ లతో తీసిన అద్భుతమైన చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్ చరణ్ అభిమానులకే కాదు మొత్తం సినిమా అభిమానులందరికీ ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఆర్ఆర్ఆర్ సినిమాకి పోటీగా ఇలాంటి సినిమాలు కూడా లేకపోవడంతో బాక్సాఫీస్ కలెక్షన్లు డోకా లేదు. అడ్వాన్స్ బుకింగ్ అయితే ఏ సినిమాకి జరగనంత భారీ స్థాయిలో ఈ సినిమాకు జరిగాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు మొత్తం సినీ ప్రపంచమే ఆర్ఆర్ఆర్ మానియా లో పడిపోయింది.

ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ ను తానే అని తెలుగు చిత్రసీమ మరోసారి సగర్వంగా నిరూపించుకుంది. ఈ సినిమా విడుదల ఈ రోజు కాగా, విడుదలకు ముందు రోజే సినీ ప్రముఖులు ఈ సినిమా నీ వీక్షించారు. సినిమా చూసిన వారందరూ ఆర్ ఆర్ ఆర్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సినిమా చూసిన పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో సినిమా మీలో ప్రశంసలు కురిపించారు.

ఈ సినిమా మీద పవన్ కళ్యాణ్ తన స్పందన ఇలా తెలియజేశారు.. బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులను రాజమౌళి గారు చక్కగా వివరించారు. ప్రతి సన్నివేశం ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. రాజమౌళి గారి దర్శకత్వ పనితనం అద్భుతంగా ఉంది. కీలక పాత్రల్లో నటించిన ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.అసలు, ఎన్టీఆర్ – చరణ్ తెరపై ఇలా ఎలా కనిపించారో అని ఆలోచిస్తున్నా. అంత చక్కగా వాళ్ళ పాత్రలు కుదిరాయి. ఈ సినిమా క్లైమాక్స్ అయితే అద్భుతంగా ఉంది. ఈ కామెంట్లకు అభిమానులు ఫిదా అయిపోతున్నారు.