Bheemla Nayak: ” భీమ్లా నాయక్” బార్ పార్టీ ఇచ్చిన త్రివిక్రమ్, వీడియో వైరల్..!

Bheemla Nayak: హిట్ టాక్ తో దూసుకుపోతున్న భీమ్లా నాయక్ భారీ కలెక్షన్లను రాబట్టింది. పవన్కళ్యాణ్ రానా ముఖ్య పాత్రలో నటించగా నిత్యామీనన్ ఇందులో హీరోయిన్లుగా నటించారు.నాగ వంశీ ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ పై నిర్మించారు, సాగర్ కే చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహించగ ,త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి మాటలు అందించడం విశేషం.భీమ్లా నాయక్ ఎంతటి విజయాన్ని అందుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంగా ‘భీమ్లా నాయక్’ యూనిట్ పెద్ద ఎత్తున సక్సెస్ పార్టీ సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే.

ముఖ్యంగా త్రివిక్రమ్ చిత్ర బృందానికి ఇచ్చిన పార్టీ హాట్ టాపిక్ గా  మారింది.ప్రస్తుతం పవన్ ఒక పక్క సినిమాలతో.. మరోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నాకూడా పార్టీకి హాజరవడం జరిగింది. పవన్ కళ్యాణ్ హాజరైన ఏ పార్టీ అయినా, ఓ రేంజ్ సక్సెస్ అవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం త్రివిక్రమ్ ఇచ్చిన ఏ పార్టీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.పవన్ తో త్రివిక్రమ్ కి సాన్నిహిత్యం కారణంగానే ‘భీమ్లా నాయక్’ సక్సెస్ పార్టీకి పవన్ హాజరైనట్లు చెప్పొచ్చు.

ఓ బార్ లో ఈ పార్టీని ఏర్పాటు చేయగా దాదాపు అంతా అంటెడ్ అయ్యి పార్టీని ఎంజాయ్ చేశారు. ఇక పవన్ కూడా హాజరు అవడంతో పార్టీ లెవెల్ మారిపోయింది.ఇక తాజాగా ఆ పార్టీకి సంబంధించిన వీడియోను మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది..