Pavan Kalyan : సినిమాలో సర్ ప్రైజ్ మాములుగా ఉండదట…హరి హర వీరమల్లు నుండి వైరల్ అవుతున్న వార్త…!

Pavan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలతో అలరించారు. ఇక ఇపుడు హరి హర వీరమల్లుగా రాబోతున్నాడు. ఇక ఈ సినిమా గురించి ఏ చిన్న అప్ డేట్ ను పవన్ కళ్యాణ్ అభిమానులు మిస్ అవడం లేదు. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న మొదటి జానపద చిత్రం కావడంతో ఇంకా ఆసక్తి కనబరుస్తున్నారు అభిమానులు.

ఇక ఈ సినిమా గురించి ఈ మధ్య పవన్ కత్తిసాము వీడియో విడుదల చేసి అభిమానులకు ట్రీట్ ఇచ్చారు చిత్ర యూనిట్.గ్రీన్ మ్యాట్ లో కీలక పోరాట ఘట్టాలని షూట్ చేస్తున్నారు. అంతే కాకుండా భారీ సెట్ లలోనూ షూటింగ్ అనేది జరుగుతోంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కీలక పాత్రలో రోషనారగా బాలీవుడ్ సెక్సీ లేడీ నర్గీస్ ఫక్రీ కూడా కనిపించబోతోంది. ఇక ఈ సినిమాలో ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ బందిపోటు దొంగ హరిహర వీర మల్లు పాత్రలో నటిస్తున్నారు. రాబిన్ హుడ్ తరహాలో సాగే పాత్రకావడంతో అభిమానుల అంచనాలు మాములుగా లేవు. ఇక ఇపుడు మరో ఆసక్తికర వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.అయితే కథానుగుణంగా సినిమాలో పవన్ కళ్యాణ్ మూడు విభిన్నమైన గెటప్ లలో కనిపించనున్నారని తెలిసింది. అంతే కాకుండా సినిమాలో దాదాపుగా 30 రకాల థీమ్ దుస్తుల్లో పవన్ కళ్యాణ్ కనిపించి సర్ ప్రైజ్ చేయనున్నారని అవి సినిమాకు ఎంతో ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలిసింది.