అక్కడ ఇండియాస్ రికార్డు రిలీజ్ గా “పఠాన్”.!

ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ అయ్యిన మొదటి సినిమా ఏదన్నా ఉంది అంటే ఆ సినిమా బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన “పఠాన్” అని చెప్పాలి. కంటెంట్ పరంగా యావరేజ్ గా ఉన్నప్పటికీ షారుఖ్ స్టార్ పవర్ అయితే ఈ చిత్రానికి బాగా వర్కువుట్ అయ్యి బాలీవుడ్ హిస్టరీ లోనే రికార్డు రన్నర్ గా అయితే నిలిపింది.

ఇక ఈ చిత్రం 1000 కోట్లకి పైగా వసూళ్లు అందుకోగా ఈ వసూళ్ళలో సగానికి పైగా ఓవర్సీస్ మార్కెట్ నుంచే వచ్చాయి. మరి ఈ చిత్రం ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ లో మరో రికార్డు రిలీజ్ కి సిద్ధం అయ్యినట్టుగా తెలుస్తుంది. కాగా ఈ చిత్రం రష్యా సంయుక్త కామన్వెల్త్ దేశాల్లో అయితే మూడు వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుందట.

దీనితో ఈ చిత్రం ఇండియా నుంచి మొదటి బిగ్గెస్ట్ ఎవర్ రిలీజ్ గా రికార్డు సెట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి రష్యా కూడా ఈ చిత్రాన్ని బిగ్ నంబర్స్ సెట్ చేస్తుంది అని ట్రేడ్ అంటున్నారు. ఇక అక్కడ వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.

ఇక ఈ చిత్రంలో మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సాలిడ్ క్యామియో లో నటించగా దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించింది. అలాగే జాన్ అబ్రహం విలన్ గా నటించగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం  బడ్జెట్ తో అయితే యష్ రాజ్ ఫిల్మ్స్ వారు ఈ సినిమాని నిర్మాణం వహించారు.