“సలార్” లో శృతి రోల్ పై నీల్ ఆసక్తికర కామెంట్స్.!

Sruthi hasan comments on prabhas and prashanth neel

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది ప్రభాస్ నటించిన భారీ సినిమా “సలార్” చెప్పాలి. కాగా ఈ సినిమా రేపు డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ చేస్తుండగా ఆడియెన్స్ లో కూడా చాలా ఆసక్తి ఇప్పుడు నెలకొంది.

ఇక మేకర్స్ కూడా రిలీజ్ ఫైనల్ గా భారీ హడావుడి లేకుండానే సినిమాని రిలీజ్ చేసేస్తున్నారు. కానీ కొన్ని ఆసక్తికర ఇంటర్వ్యూస్ అయితే తాము ఇచ్చారు. కాగా ఈ సినిమాలో అనేకమంది స్టార్ నటులు ఉన్నారు. అయితే వారిలో హీరోయిన్ శృతి హాసన్ కూడా ఒకామె కాగా అసలు ఈ సినిమాలో ఆమెని నామ్ కె వాస్తె మాత్రమే తీసుకున్నారా అన్నట్టుగా మొదటి నుంచి అనిపించింది.

పెద్దగా టీజర్ ట్రైలర్ లలో ఆమెని చూపించింది లేదు. రెండో ట్రైలర్ లో ఏదో చూపించాలి కాబట్టి చూపించారు అన్నట్టు చాలా మందికి అనిపించింది. దీనితో దాదాపు స్టార్ హీరోస్ సినిమాల్లో అందరి హీరోయిన్స్ లానే పెద్దగా ఇంపార్టెంట్ కాని పాత్రలోనే ఆమె కనిపిస్తుంది అని అంతా అనుకున్నారు.

కానీ నీల్ ఈ అంచనాలు తప్పని చెప్తున్నాడు. సలార్ లో శృతి హాసన్ చేసిన పాత్ర చాలా ముఖ్యమైనది అని ఆమె సినిమాలో చాలా కీలక పాత్రగా కనిపిస్తుంది అని వెల్లడి చేసాడు. అలాగే తనకి హీరోయిన్స్ ని సినిమాలో కేవలం గ్లామర్ కోసమే వాడుకోవడం ఇష్టం లేదని కూడా చెప్పాడు. దీనితో సలార్ లో ఆమె రోల్ పై అందరికీ ఒక క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి.