నాగచైతన్య సినిమాకు టైటిల్ ను ఖరారు చేసిన పరశురామ్..

ప్రస్తుతం తన దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సక్సెస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ పరుశురామ్. ఇక ఈయన తర్వాతి సినిమా నాగచైతన్యతో ఫిక్స్ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా గురించి పలు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి.

ఇక ఈ సినిమాకు ‘నాగేశ్వరరావు’ అనే టైటిల్ ను పరశురామ్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి టైటిల్ సెట్ చేసిన తర్వాతే సెట్స్ పైకి వెళ్లే అలవాటు ఉందని గతంలో అన్నాడు. ఇక ఖచ్చితంగా ఆ సినిమా టైటిల్ ఇదే అని తెలుస్తుంది. ఇక త్వరలోనే టైటిల్ పోస్టర్ ను కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాను పరశురామ్ ఏ విధంగా తెరకేక్కిస్తాడో చూడాలి.