Panchatantra : రౌడీ బాయ్ చేతుల మీదుగా పంచతంత్రం సినిమా పాట… ఆకట్టుకుంటున్న మెలోడీ పాట…

Panchatantra: టాలీవుడ్ లో త్వరలో విడుదలకు రెడీ గా వున్నా సినిమా పంచతంత్ర.టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.హర్ష పులిపాక ను దర్శకుడిగా పరిచయం చేస్తూ అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు కలసి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ”పంచతంత్రం”.ఈ చిత్రం లో కళా బ్రహ్మ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల కు సిద్ధంగా వుంది.ఇంతకు ముందు బ్రహ్మానందంపై విడుదల చేసిన ప్రచార చిత్రాలు, ఫస్ట్ గ్లింప్స్‌, ఏ రాగమో లిరికర్ వీడియోకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది.ప్రశాంత్‌ ఆర్‌. విహారి ఈ సినిమాకి సంగీతన్ని అందిస్తున్నారు.వెయ్యి చిత్రాలకు పైగా చేసిన బ్రహ్మానందం గారు మా సినిమాలో వేదవ్యాస్ గా ముఖ్యమైన పాత్రలో నటిస్తుండటం విశేషం.తాజాగా ఈ చిత్రంలోని “అరెరే అరెరే మాటే..రాదే..మనసే పలికే క్షణములో”.లిరికల్ వీడియోను సెన్సేషల్ హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు.

లిరికల్ వీడియోను కిట్టు విస్సాప్రగడ రాయగా ప్రశాంత్‌ ఆర్‌. విహారి, శ్రవణ్ భరద్వాజ్ లు సంగీతం అందించారు.ఈ పాటని చిన్మయి,ఎస్.పి చరణ్ లు అద్బుతంగా ఆలపించారు.రాజ్ కె నల్లి కెమెరా విజువల్స్ ఫ్రెష్ ఫీల్ ని కలిగిస్తోంది.ప్రస్తుతం ఈ పాట సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.చాలా మంది సంగీత ప్రియుల ప్లేలిస్ట్ లో ఇది చేరిపోయింది అనడం లో అతిషయోక్తి లేదు. అంతగా ఈ పాట అందరిని అల్లరిస్తోంది.త్వరలోనే సినిమా విడుదల ఎపుడు అనేది అధికారికంగా ప్రకటిస్తాం అని చిత్ర బృందం తెలియచేసింది.