తెలుగు సినిమా ఇండస్ట్రీలో మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో మెగా వెర్సెస్ మంచు ఫ్యామిలీ అన్నట్టుగా పెద్ద ఎత్తున ఈ రెండు కుటుంబాల మధ్య పోటీ ఏర్పడింది. మా ఎన్నికల సమయంలో మంచు విష్ణు పోటీ చేయగా ఇతనికి అపోజిషన్ గా నటుడు ప్రకాష్ రాజ్ నిలబడ్డారు.అయితే ప్రకాష్ రాజుకు మెగా ఫ్యామిలీ మద్దతు లభించడంతో ఈ రెండు కుటుంబాల మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది.ఇలా మా ఎన్నికల సమయం నుంచి మెగా వర్సెస్ మంచు అన్నట్టు ఈ రెండు కుటుంబాల మధ్య తరచూ వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.
తాజాగా మరోసారి మంచు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య పోటీ ఏర్పడినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే మంచు విష్ణు ఒకవైపు మా బాధ్యతలను చూసుకుంటూ మరోవైపు సినిమాలలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన సూర్య అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో నటిస్తున్నటువంటి చిత్రం జిన్నా. సన్నీలియోన్ పాయల్ రాజ్ పుత్ మంచు మనోజ్ నటిస్తున్నటువంటి ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకొని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోని ఈ సినిమాని అక్టోబర్ 5వ తేదీ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించి మెగాస్టార్ చిరంజీవికి షాక్ ఇచ్చారు.
ఇప్పటికే దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీ నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా విడుదలకు సిద్ధమవుతుందని ముందుగా ప్రకటించారు. అయితే ఇదే తేదీన చిరంజీవి గాడ్ ఫాదర్ విడుదలవుతుందని ప్రకటించడంతో నాగార్జున వెనక్కి తగ్గే ఆలోచనలు చేసినప్పటికీ చివరికి మాత్రం ఆగస్టు 5వ తేదీ మెగాస్టార్ చిరంజీవి నాగార్జున పోటీ పడిపోతున్న సమయంలోనే మంచు విష్ణు కూడా జిన్నా సినిమాని విడుదల చేస్తూ పోటీకి దిగారు.ఇప్పటికే ఇద్దరు సార్ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయని తెలియడంతో థియేటర్ల కొరత ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే విష్ణు జిన్నా సినిమా విడుదల అవుతుందని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలా ఒకేరోజు మూడు సినిమాలు విడుదల కాగా థియేటర్ల కొరత ఏర్పడటమే కాకుండా కలెక్షన్లు తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ మూడు సినిమాలలో ఎవరు దసరా బరిలో విజయం సాధిస్తారోనని అభిమానులు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.