ఓటిటి : లేటెస్ట్ ప్రోమోతో బాలయ్య షో లో ప్రభాస్ కన్ఫర్మ్..!

ఒక్క తెలుగులోనే కాకుండా ఇండియా లోనే ఓటిటి హిస్టరీ లో మోస్ట్ పాపులర్ షో గా పేరు తెచ్చుకున్న లేటెస్ట్ టాక్ షో ఏదన్నా ఉంది అంటే అది నందమూరి బాలకృష్ణ తో అల్లు ఫ్యామిలీ ప్లాన్ చేసిన అదిరే ఎంటర్టైనింగ్ టాక్ షో “అన్ స్టాప్పబుల్”.

ఈ షో విజయవంతంగా మొదటి సీజన్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ అయితే ఇప్పుడు రెండో సీజన్ కూడా అంతకు మించిన హంగామాతో స్టార్ట్ అయ్యింది. అలా ఇప్పటికి 5 ఎపిసోడ్స్ మేర కంప్లీట్ చేసుకున్న ఈ షోలో అయితే గత కొన్నాళ్ల నుంచి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా కనిపిస్తాడని కొన్ని గాసిప్స్ రాగ.

ఇప్పుడు నేరుగా ఆహా వారే ఈ న్యూస్ ని కన్ఫర్మ్ చేసేసి ఓ సాలీడ్ ప్రోమో కట్ ని రిలీజ్ చేశారు. మరి కంప్లీట్ గా ప్రభాస్ పై ఏక్షన్ కట్స్ తో ఉన్న ఈ ప్రోమోకి బాలయ్య వీర సింహా రెడ్డి మ్యూజిక్ తో లింక్ చేసి రిలీజ్ చెయ్యగా ఇప్పుడు ఈ మాసివ్ ప్రోమో ఫ్యాన్స్ ని అమితంగా ఆకట్టుకుంటుంది.

దీనితో అయితే ఎట్టకేలకి ప్రభాస్ బాలయ్య తో కలిసి ఓ షోలో కూర్చోనున్నాడని చెప్పి తీరాలి. ఇక ఈ స్పెషల్ ఎపిసోడ్ షూట్ ఈరోజే జరుగుతుండగా మంచి స్పెషల్ డే చూసి ఈ ఎపిసోడ్ ని స్ట్రీమింగ్ కి తీసుకురానున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ ఫ్రెండ్ ప్రముఖ హీరో గోపీచంద్ కూడా కనిపిస్తాడని బజ్ ఉంది.