అక్కినేని నాగార్జునకు అవమానం. ఆయన నటిస్తున్న చిత్రాన్ని తీసుకోవడానికి ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నిరాకరించడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. `మన్మథుడు 2`తో దారుణమైన ఫ్లాప్‌ని సొంతం చేసుకున్న నాగార్జున ఆ తరువాత వరుసగా సినిమాల్ని లైన్‌లో పెట్టారు. ఆ క్రమంలో నాగ్ నటిస్తున్న తాజా చిత్రం `వైల్డ్ డాగ్`. దర్శకుడు వంశీ పైడిపల్లి చిత్రాలకు స్టోరీ సిట్టింగ్స్‌తో పాటు డైరెక్షన్ టీమ్‌లో కీలకంగా వ్యవహరించిన అహిషోర్ సాల్మన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కొరటాల మిత్రుడు, `ఆచార్య` నిర్మాత నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2009లో హైదరాబాద్ నేపథ్యంలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాగార్జున ఓన్ ఎస్‌జీ కామాండోగా ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా కనిపించబోతున్నారు. బాలీవుడ్ హీరోయిన్స్ దియా మీర్జా, సయామీ ఖేర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. `గగనం` తరహా కథ, కథనాలు వుంటాయని తెలిసింది.
ఉగ్రవాదం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి బిజినెస్ పరంగా క్రేజ్ లేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి బిజినెస్ జరగలేదని తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఓటీటీకి అమ్మాలని నిర్మాత ప్లాన్ చేసినా నిరాశే ఎదురైనట్టు ఇన్‌సైడ్ టాక్. ఓ ఓటీటీని సంప్రదిస్తే ఆసక్తిని చూపించలేదట. మరో రెండు ఓటీటీలు కూడా ఇదే తరహాలో నాగ్ సినిమాని రిజెక్ట్ చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.