ట్రైలర్‌తో అదరగొట్టిన…ఊరుపేరు భైరవకోన !

టాలీవుడ్‌ మూవీ లవర్స్‌ ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి ..’ఊరు పేరు భైరవకోన’. వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. సందీప్‌ కిషన్‌ , వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్‌ డేట్‌ తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ను లాంఛ్‌ చేశారు.

కన్నులతో చూసేది కొంచెమే..గుండెల్లో లోతే కనిపించెనే..అంటూ హీరోయిన్‌ అందం గురించే వర్ణించే సన్నివేశాలతో ట్రైలర్‌ మొదలవుతుంది. గరుడపురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే ఈ భైరవ కోన.. భగవంతుడి ఆధీనంలో లేనిది కర్మ సిద్దాంతం.. లిఖించబడ్డదే జరుగుతుంది. రక్తపాతం జరగనీ అంటూ గూస్‌బంప్స్‌ తెప్పించే సంభాషణలతో సాగుతున్న ట్రైలర్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.

ఇంతకీ భైరవకోనలో ఏం జరిగిందనేది సస్పెన్స్‌లో పెడుతూ కట్‌ చేసిన ట్రైలర్‌ మూవీపై అంచనాలు పెంచేస్తుంది. ఏఎంబీ సినిమాస్‌లోని స్క్రీన్‌ 2లో ట్రైలర్‌ లాంఛ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌ సింగిల్‌ నిజమే నే చెబుతున్నా లిరికల్‌ వీడియో సాంగ్‌ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్‌తో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తూ.. సినిమాపై సూపర్‌ హైప్‌ క్రియేట్‌ చేస్తోంది.

మరోవైపు రెండో సింగిల్‌ హమ్మ హమ్మ సాంగ్‌కు మ్యూజిక్‌ లవర్స్‌ను ఇంప్రెస్‌ చేస్తోంది. శేఖర్‌ చంద్ర మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అనిల్‌ సుంకర సమర్పణలో రాజేశ్‌ దండా నిర్మిస్తున్నారు. టైగర్‌ తర్వాత సందీప్‌ కిషన్‌, వీఐ ఆనంద్‌ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది.

ఈ సారి ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌తో వస్తున్న వీఐ ఆనంద్‌ ప్రేక్షకులను ఎలా ఇంప్రెస్‌ చేస్తాడని ఎక్జయిటింగ్‌గా చూస్తున్నారు. ఫిబ్రవరి 9న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్‌ ప్రమోషన్స్‌ షురూ చేశారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం ఈ మూవీ ట్రైలర్‌ ను విడుదల చేశారు.

ప్రేక్షకుల్లో ఈ ట్రైలర్‌ ఆసక్తిని క్రియేట్‌ చేస్తోంది. చాలా రోజులుగా హిట్‌ లేని సందీప్‌ కిషన్‌ ఈ మూవీతో సూపర్‌ హిట్‌ కొట్టబోతున్నట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ఇందలో సందీప్‌ కు జోడీగా వర్ష బొల్లమ్మ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ’నిజమే నే చెబుతున్నా’ లిరికల్‌ వీడియో సాంగ్‌ కు భారీ రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమాకు శేఖర్‌ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అనిల్‌ సుంకర సమర్పణలో రాజేశ్‌ దండా ఈ మూవీని నిర్మించారు