ఫిబ్రవరిలోనే ‘భైరవకోన’ విడుదల!

టాలీవుడ్‌ సందీప్‌ కిషన్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం ఊరు పేరు భైరవకోన. వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. వర్ష బొల్లమ్మ ఫీమేల్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తోంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారని తెలిసిందే. అయితే ఇదే సమయంలో రజినీకాంత్‌ నటించిన లాల్‌ సలామ్‌, రవితేజ నటించిన ఈగల్‌ సినిమాలు విడుదలవుతున్నాయి.

ఈ నేపథ్యంలో సందీప్‌ కిషన్‌ సినిమా విడుదల ఆలస్యమవుతుందంటూ వార్తలు హల్‌ చల్‌ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలకు ఫుల్‌ స్టాప్‌ పెడుతూ ఊరు పేరు భైరవకోన అనుకున్న సమయానికే విడుదలవుతుందంటూ క్లారిటీ ఇచ్చేశాడు సందీప్‌ కిషన్‌. పోస్టర్‌ను షేర్‌ చేస్తూ ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేశాడు సందీప్‌ కిషన్‌. ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది.

విడుదలకు ముందే ఫస్ట్‌ సింగిల్‌ నిజమే నే చెబుతున్నా లిరికల్‌ వీడియో సాంగ్‌ నెట్టింట టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తూ.. మ్యూజిక్‌ లవర్స్‌ మనసు దోచేస్తోంది. ఈ ఒక్క సాంగ్‌ సినిమాపై సూపర్‌ హైప్‌ క్రియేట్‌ చేస్తోంది. మరోవైపు రెండో సింగిల్‌ హమ్మ హమ్మ సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది.

ఈ చిత్రానికి శేఖర్‌ చంద్ర మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ అనిల్‌ సుంకర సమర్పణలో రాజేశ్‌ దండా నిర్మిస్తున్నారు. టైగర్‌ తర్వాత సందీప్‌ కిషన్‌, వీఐ ఆనంద్‌ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. ఈ సారి ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌తో వస్తున్న వీఐ ఆనంద్‌ ప్రేక్షకులను ఎలా ఇంప్రెస్‌ చేస్తాడని ఎక్జయిటింగ్‌గా చూస్తున్నారు.