ప్చ్..మళ్ళీ రవితేజని మోసం చేసారా?

తెలుగు సినిమా దగ్గర  తమ స్వశక్తి ఎదిగి మంచి స్టార్ హీరో స్టేటస్ తెచ్చుకున్న అతి కొద్దీ మంది హీరోస్ లో మాస్ మహారాజ రవితేజ కూడా ఒకరు. మరి రవితేజ ఇప్పుడు తనకి ఐదు పదుల వయసు ఉన్నప్పటికీ కూడా తన కెరీర్ లో ఎంతలా కష్టపడే వాడో ఇప్పుడు కూడా అంతకు మించే సినిమా పట్ల చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తున్నాడు.

కాగా ఇప్పుడు రవితేజ హీరోగా నటించిన “ఈగిల్” చిత్రం నిజానికి ఈ జనవరి 13న విడుదల కావాల్సి ఉంది. కానీ మేకర్స్ ఇండస్ట్రీ బాగు కోసం ఈ సినిమా రిలీజ్ ని వాయిదా వేసుకుంటున్నట్టుగా తెలిపారు. కాగా ఈ చిత్రంని జనవరిలో కానీ తప్పిస్తే సోలో రిలీజ్ ఇస్తామని ప్రస్తుతం సినిమాలు ఉన్న నిర్మాతలు చెప్పడంతో ఈగిల్ యూనిట్ ఫిబ్రవరి 9కి షిఫ్ట్ చేసుకున్నారు.

కానీ అనూహ్యంగా అప్పటికే ఆ టైం లో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. ఇక తాజాగా తమిళ నాట సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య పాత్రలో నటించిన “లాల్ సలామ్” కూడా ఇదే డేట్ ని లాక్ చేసుకుంది. ఈ సినిమా కూడా తెలుగులో విడుదల కానుంది.

మరి ఇన్ని సినిమాలు పోటీ ఉంటే అది రవితేజ సినిమాకి ఎలా సోలో రిలీజ్ అవుతుంది అనేది ప్రశ్న. కాగా ఆల్రెడీ ఒకసారి తన సినిమా రానివ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకా అదే డేట్ మరిన్ని సినిమాలు వస్తున్నాయి. దీనితో మళ్ళీ తనని ఇది మోసం చేసినట్టే కదా అని ఫ్యాన్స్ సహా కొందరు అనుకుంటున్నారు.